Saturday, October 5, 2024

జగన్‌తో పెట్టుకుంటే గట్లుంటుంది రేణుకమ్మ

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు అయిన సరే వైసీపీ అధినేత గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేయలేరంటే అతిశేయోక్తి కాదు. టీడీపీ , జనసేన పార్టీలు నిత్యం జగన్‌ను విమర్శిస్తునే జగన్ జపం చేస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ నాయకులు కూడా జగన్ మీదనో లేక ఆయన పాలన మీదనే ఏదో రకంగా స్పందించడానికి ప్రయత్నిస్తుంటారు. జగన్‌‌ను విమర్శిస్తే… ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వారి ఆశ. అయితే జగన్‌ను విమర్శించిన వారందరు కూడా బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. చాలామంది నాయకుల్లో ఇది నిరుపితం కూడా అయింది. తాజాగా మరోసారి ఇది నిజమే అని తేలింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని రేణుక చౌదరి కూడా ఇటీవల కాలంలో జగన్‌పై విమర్శలు చేయడం జరిగింది.

అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న రేణుకు చౌదరి…అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. ఇదే సమయంలో కమ్మ కులానికి అనుకులంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కమ్మ కులం లేకుండా క్యాబినెట్ ఉండటం ఇదే మొదటిసారి అని.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని రేణుక చౌదరి పిలపునిచ్చారు. కట్ చేస్తే…తెలంగాణలోనే ఆమెకు రాజకీయ మనుగడ కష్టం అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో రేణుక చౌదరి కూడా ఒకరు. ఖమ్మం నుంచి ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. అది కూడా వైఎస్ఆర్ హయంలో కావడం విశేషం. 2014,2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు.

చాలా రోజుల తరువాత ఆమె బహ్య ప్రపంచలో వచ్చినప్పటికి కూడా ఆమె గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆమెను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో కూడా రేణుక చౌదరి ఎక్కడ కూడా కనిపించలేదు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనాలని రేణుక చౌదరికి ఆహ్వానం కూడా అందని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ప్రస్తుత కాంగ్రెస్ పీసీసీ అయిన రేవంత్ రెడ్డితో.. రేణుక చౌదరికి పడటం లేదని.. ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉందని సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఆమెకు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తరువాత రేణుక చౌదరి రాజకీయ జీవితానికి దూరం అయిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు కూడా స్పందిస్తున్నాయి. ఉన్న పార్టీలో పని చేయడం రేణుక చౌదరి మొదట నెర్చుకోవాలని.. తరువాత వేరే వారి గురించి హితవు పలుకుతున్నారు. మరి ఈ పరిణామాల మధ్య రేణుక చౌదరి రాజకీయ జీవితం ఎలా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!