Saturday, October 5, 2024

ఇన్ని చేసిన జగన్ ను లోకేష్ ఇంకేమి ప్రశ్నిస్తాడు!!

- Advertisement -

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అంటూ పాదయాత్ర చెయ్యడానికి సిద్ధమైన లోకేష్ కు అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విషయంపై ప్రశ్నిస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని దాదాపు అమలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీలు ఇవ్వడం, జగనన్న అమ్మ వోడి, జగనన్న చేదోడు పథకం, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు నేడు, వైస్సార్ ఆరోగ్య ఆసరా, వైస్సార్ భీమా, వైస్సార్ ఆరోగ్య శ్రీ, వైస్సార్ చేయూత స్కీం , వైస్సార్ జలయజ్ఞం స్కీం, వైస్సార్ కళ్యాణ్ కనుక, వైస్సార్ కంటి వెలుగు వైస్సార్ మత్సకార నేస్తం, వైస్సార్ రైతు భరోసా, వైస్సార్ సంపూర్ణ పోషణ అని చాల స్కీంలను అమలు చేస్తుంది. దాదాపు ప్రజల ప్రతి అవసరానికి ఒక పథకాన్ని పెట్టి, వాటిని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అమలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంపై లోకేష్ ఏమి ప్రశ్నిస్తారో చూడాలి.

మాట్లాడటమే సరిగ్గా రాణి లోకేష్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి, జగన్ ను ప్రశ్నిస్తానంటే చంద్రబాబు నాయుడు ఎలా నమ్మాడో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ట్రోల్ మెటీరియల్ ఇస్తూ, ఎదవ అవ్వడం తప్పా పాదయాత్ర ద్వారా లోకేష్ పొడిచేదేమి లేదు. ఎందుకంటే లోకేష్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే, జగన్ ప్రభుత్వం తెచ్చిన పథకాల వల్ల లబ్దిపొందిన ప్రజలే లోకేష్ కు చుక్కలు చూపిస్తారు. సొంతంగా వస్తే గెలవలేమని భయపడే వాళ్లకు రాజకీయాలు ఎందుకో అర్థం కావడం లేదు.

గతంలో కూడా జగన్ ను ఓడించడానికి టీడీపీ -జనసేన ఒకరకంగా కలిసే ప్రయత్నాలు చేశాయి కానీ ప్రజలు వాటిని తిప్పి కొట్టి, జగన్ ను అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వచ్చిన కూడా సేమ్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వుద్ది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్ ఓడించడం కష్టం ఎందుకంటే జగన్ పక్షాన ప్రజలు ఉన్నారు కాబట్టి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!