Monday, February 10, 2025

బిజెపి, పవన్ ద్వారా వైసీపీ నిర్వీర్యం.. చంద్రబాబు ప్లాన్ అదే

- Advertisement -

ఏపీలో ఫుల్ క్లారిటీ వచ్చింది. వైసీపీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతోంది. అందులో కీరోల్ ప్లే చేస్తున్నారు చంద్రబాబు. పావుగా మారుతున్నారు పవన్ కళ్యాణ్. పెద్ద స్కెచ్ వేస్తోంది బిజెపి. అంతిమంగా వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దాదాపు వైసీపీని నిర్వీర్యం చేసేందుకు ముప్పేట దాడి చేయాలని స్పష్టమవుతోంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారివి ఉన్నాయి. ఏపీలో బిజెపి ఎదగాలి. ఏపీ ద్వారా జాతీయ రాజకీయాల్లో తన పట్టును నిలుపుకోవాలి. చంద్రబాబు టిడిపి నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి రావాలి. అయితే పవన్ అంతిమ లక్ష్యం మాత్రం జగన్ మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం కాకూడదు. ఇలా ఈ మూడు పార్టీలు.. వేరువేరు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే చంద్రబాబు తో పాటు పవన్ ను గౌరవించి వైసీపీని టార్గెట్ చేసుకుంది బిజెపి.

పవన్ కళ్యాణ్ ప్రకటన చూసిన తర్వాత.. ఇప్పుడప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీతో తెగదింపులు చేసుకోరు. కచ్చితంగా కొన్నేళ్ల ప్రయాణం సాగుతుంది. ఆ విషయాన్ని చంద్రబాబు సైతం గమనించారు. జగన్ వస్తే ఇబ్బందికరమని భావిస్తున్నారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో జగన్ మరోసారి సీఎం కాకూడదని బలంగా కోరుతున్నారు. అందుకే సమన్వయంతో ముందుకు సాగాలని జనసైనికులను విజ్ఞప్తి చేస్తున్నారు. బహిరంగ లేఖ రాసి హెచ్చరికలు కూడా పంపుతున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలకు సైతం విన్నపాలు పంపుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు రాజకీయ ప్రయోజనం కంటే.. జగన్ పతనమే ఎక్కువ అన్నట్టు ఉంది.

ఏపీలో మరోసారి కూటమి ప్రభుత్వం రావాలి. టిడిపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చంద్రబాబు లక్ష్యం అదే. అందుకే జగన్ దారుణంగా దెబ్బతీయాలన్నది చంద్రబాబు ప్లాన్. అయితే అది బిజెపి ద్వారా ప్లాన్ చేస్తున్నారు. వైసిపి రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే.. సింహభాగం పదవులు బిజెపికి ఇవ్వాలన్నది ఒప్పందం. పైగా రాజకీయంగా బలపడతామంటే ఎంతవరకైనా వెళ్లేందుకు బిజెపి సిద్ధంగా ఉంటుంది. అందుకే చంద్రబాబుకు ఈ విషయం తెలుసు కాబట్టి రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకి ఇస్తున్నారు. పదవుల ప్రాతినిధ్యం పెంచుతున్నారు. అదే సమయంలో కేంద్రానికి ఏ షరతులు పెట్టకుండా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అంటే చంద్రబాబు రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో కూటమి ఐక్యతకు పెద్దపీట వేస్తున్నారు. ఆయనతో జనసైనికులను కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు బిజెపిని సైతం తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు.

బిజెపి సైతం జగన్ పట్ల విపరీతమైన వ్యతిరేకతతో ముందుకు సాగుతోంది. వైసీపీని నిర్వీర్యం చేసి ఆ ప్లేస్ లోకి రావాలని బిజెపి భావిస్తోంది. అందుకే ముందుగా జగన్ ను ఏకాకి చేయాలని చూస్తోంది. అయితే బిజెపికి తెలియని విషయం ఏమిటంటే.. జగన్ ఒక జాతీయ పార్టీని ఢీకొట్టి ఈ స్థాయికి చేరుకున్నారు అన్న విషయం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఊపు మీద ఉన్న పరిస్థితుల్లోనే జగన్ లెక్క చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితో పాటు తాను ఒంటరిగా బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసి అదే కాంగ్రెస్ పార్టీని మట్టికరించారు. అసలు ఏపీలో జవసత్వాలు లేకుండా చేశారు. అదే బిజెపి ఆయనకు ఒక లెక్క. కచ్చితంగా వైసీపీని నిర్వీర్యం చేయాలన్న బిజెపి కళ తిరిగే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఏపీలో జగన్ ను నిర్వీర్యం చేయడం అనేది జరగని పనిగా తేల్చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!