వైసిపి అన్నింటికీ సిద్ధపడిందా? రాజ్యసభ పదవులన్నింటిని బిజెపి కబలిస్తుందని అంచనా వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాను ఎవరు ఊహించలేదు. కనీసం అంచనా వేయలేదు కూడా. కానీ దానిని సాధించారు. అయితే ఎవరు సాధించారు అన్నది మాత్రం తెలియడం లేదు. కచ్చితంగా విజయసాయి రాజీనామా వైసీపీకి దెబ్బ. అయితే చేయించింది ఎవరనేది మాత్రం ఇంతవరకు తెలియదు. కచ్చితంగా కూటమిపై అనుమానం. అలాగని పర్టిక్యులర్ పార్టీ గురించి తెలియదు. ఈ విషయంలో విజయ్ సాయి రెడ్డి సైతం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ స్పష్టత కరువవుతోంది.
అయితే ఏపీ రాజకీయాల్లో ఒక్కటి మాత్రం నిజం. ముందుగా వైసిపి రాజ్యసభ ప్రాతినిధ్యం తగ్గుతుంది. కూటమి ప్రాతినిధ్యం పెరుగుతుంది. అలా ఉంటుంది వైసీపీ రాజ్యసభ సభ్యులపై ఉండే ప్రెషర్. తప్పకుండా వారు పదవులు వదులుకోవాలి. పార్టీకి రాజీనామా చేయాలి. అవసరం అనుకుంటే కూటమి పార్టీలో చేరాలి. లేకుంటే విజయ్ సాయి రెడ్డి మాదిరిగా వ్యవసాయం చేసుకుంటామని చెప్పాలి. అయితే ఈ విషయంలో కూటమిది ఒకటే పెట్టుబడి. దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రాజ్యసభ సభ్యులు ప్రధాన టార్గెట్. వారి అవసరాలతో పాటు వ్యాపారాలను టార్గెట్ చేస్తారు. అవసరం అనుకుంటే నష్టం చేయడానికి కూడా వెనకాడరు. ఈ ఫార్ములాను అనుసరించి విజయసాయిరెడ్డిని దారికి తెచ్చుకున్నారు. మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులను సైతం ఇదే మాదిరిగా దారిలోకి తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి వైసీపీకి రాజ్యసభలో బలం 11 స్థానాలు. కానీ ఇప్పుడు అది ఏడుకు పడిపోయింది. తొలుత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. అయితే ఇందులో ఇద్దరు ఎన్నికల ముందు నాటికి అసంతృప్తితో ఉన్నారు. ఒక్కరు మాత్రం ఎన్నికల తరువాత అవసరాల మేరకు రంగును మార్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కేసులకు భయపడ్డారు. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు విషయంలో తన కుటుంబానికి అన్యాయం జరుగుతుందని.. కేసులు ఎదుర్కోవడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటించారు. అది కూటమికే మేలని ప్రకటించారు. వైసీపీని ఇబ్బందుల్లో పెట్టారు.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి మిగిలిన బలం కేవలం 7. అయితే అది కూడా నీటి బుడగెనని తెలుస్తోంది. అది వైసీపీకి సైతం తెలుసు.

ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి మిగిలిన బలం కేవలం 7. అయితే అది కూడా నీటి బుడగెనని తెలుస్తోంది. అది వైసీపీకి సైతం తెలుసు. అందుకే వైసీపీ సైతం ఒక నిర్ణయానికి వచ్చింది. కచ్చితంగా తమ బలాన్ని నిర్వీర్యం చేస్తారని ఒక అంచనాకు వచ్చింది. మిగిలితే ఒక్క వైవి సుబ్బారెడ్డి మిగులుతారని.. మిగతా వారంతా పార్టీ మారడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఇది ఒక్క రాజ్యసభ పదవులతో ఆగదు. కచ్చితంగా లోక్సభ సభ్యులను సైతం కూటమి టచ్ చేస్తుంది. అప్పుడు ఆ వంతు ఎవరికి వస్తుందా అన్నది ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది.
వైసీపీకి నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయి. అందులో కడప కీలకమైన స్థానం. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచారు. ఆయనపై వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది. తప్పకుండా ఆ కేసును అడ్డం పెట్టుకొని కూటమి భయపెడుతుంది. మరోవైపు రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. కచ్చితంగా ఆయనపై సైతం ఒత్తిడి ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఉన్న కేసులను సాకుగా చూపుకొని తమ వైపు తిప్పుకోవాలని కూటమి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అరకు తో పాటు తిరుపతి ఎంపీ మిగులుతారు. కానీ ఆ ఇద్దరు కేవలం పార్టీలో నిమిత్తమాత్రులు. వారి విషయంలో ఒత్తిడి ఉన్నా లేకపోయినా ఒకటే వంతు. కచ్చితంగా మాత్రం కడప ఎంపీ తో పాటు రాజంపేట ఎంపీ పై ఒత్తిడి ఉంటుంది. కానీ వారిద్దరూ జగన్కు అత్యంత కావాల్సినవారు. సన్నిహితులు కూడా. సో ఈ విషయంలో వైసీపీ సైతం చాలా స్పష్టతగా ఉంది. తన పార్టీని ఎంత నిర్వీర్యం చేస్తే.. అంత బలోపేతం చేసుకునేలా జగన్ ప్లాన్ లో ఉన్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి
. కచ్చితంగా తమ బలాన్ని నిర్వీర్యం చేస్తారని ఒక అంచనాకు వచ్చింది. మిగిలితే ఒక్క వైవి సుబ్బారెడ్డి మిగులుతారని.. మిగతా వారంతా పార్టీ మారడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఇది ఒక్క రాజ్యసభ పదవులతో ఆగదు. కచ్చితంగా లోక్సభ సభ్యులను సైతం కూటమి టచ్ చేస్తుంది. అప్పుడు ఆ వంతు ఎవరికి వస్తుందా అన్నది ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది.