Monday, February 10, 2025

ఆ నలుగురు అంటూ వైసిపి పై ఎల్లో మీడియా విషప్రచారం

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ ను ఒంటరి చేయాలని టిడిపి ప్లాన్ చేస్తోందా? టిడిపి అనుకూల మీడియా అదే లక్ష్యంతో ఉందా? అందుకే పదే పదే ఆ నలుగురు అంటూ ప్రచారం చేస్తుందా? ఆ నలుగురే వైసీపీని దెబ్బ తీశారన్న ప్రచారం వెనుక వ్యూహం ఏంటి? అంటే మాత్రం కచ్చితంగా అందులో వ్యూహం ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలతో పాటు ఎల్లో మీడియా అదే పనిగా ఒక ప్రచారం చేస్తోంది. ఇక జగన్ పని అయిపోయిందని.. అందరూ పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. అయితే 2019 కి ముందు ఇదే మాట చెప్పారు. చిలక జోస్యాలు చెప్పారు. కానీ బొక్క బోర్ల పడింది. వైసిపి కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది.

జగన్మోహన్ రెడ్డి వ్యూహం 2019లో పనిచేసింది. జగన్ కోసం వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేశాయి. జగన్ సీఎం కావాలని కోట్లాదిమంది బలంగా కోరుకున్నారు. అయితే అదే జగన్ పాలనకు వ్యతిరేకంగా 60 శాతం మంది ఈ ఎన్నికల్లో తీర్పు చెప్పారు. కానీ 40 శాతం ఓటర్లు జై కొట్టారు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం. అయితే ఇప్పుడు పూర్తిగా వైసిపి నాశనం అయ్యిందని చెప్పడం దేనికి సంకేతం. ఆ పార్టీ క్లోజ్ అయిందని ప్రచారం చేయడం దేనికోసం. అయితే అంతటితో ఆగితే సరిపోయేది. కానీ ఇప్పుడు అదే వైసీపీకి వ్యతిరేకులు సలహా ఇస్తున్నారు. మీ మంచి అంటూ చెబుతున్నారు. అయితే ప్రత్యర్థికి మంచి జరగాలన్న కోరిక ఉంటుందా? అది నమ్మదగిన వాస్తవమేనా అంటే మౌనమే సమాధానం అవుతోంది.

వైసీపీ చుట్టూ ఆ నలుగురు చేరిపోయారని.. వారితో వైసిపికి నష్టమని.. తేల్చుకోవాల్సింది వైసీపీ అని టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ ప్రచారం పతాక స్థాయికి చేరింది. పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఉంటే వైసీపీ బాగుపడదని కూడా సలహా ఇస్తున్నారు. వైసిపి బాగుపడదన్న ఆలోచనతో ఉన్న ఎల్లో మీడియా సలహాలు ఇస్తుండడం విశేషం. వైసిపి పతనమే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఆరాటం. అది ఆల్రెడీ వారు చేసి పెడుతున్నారు కదా. వారు పార్టీలో ఉంటే మీ కోరిక తీరుతుంది కదా? అటువంటప్పుడు వారిపై మీరు ఎందుకు సలహా ఇవ్వాలి. వారి మానాన వారిని వైసీపీలో ఉంచితే మీరు అనుకున్నది సాధించగలుగుతారు కదా?

కానీ ఎల్లో మీడియా అసలు లక్ష్యం వేరే ఉంది. జగన్ అచేతనం కావాలి. జగన్ను రాజకీయంగా ఒంటరి వాడిని చేయాలి. ఆ నలుగురు ఉంటే అది అసాధ్యం. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. కూటమిలో సమన్వయం దెబ్బతింటుంది. జగన్ వ్యూహాలు సక్సెస్ అయితే దారుణంగా కూటమి దెబ్బ తింటుంది. తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే సానుభూతి చూపుతూ.. ఈ సరికొత్త పన్నాగాన్ని పన్నింది టిడిపి అనుకూల మీడియా. అంతకుమించి ఇందులో వేరే ఏది కనిపించడం లేదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!