Saturday, December 14, 2024

Chandrababu: చంద్రబాబు రెండు నాల్కల ధోరణి.. అప్పుడలా..! ఇప్పుడిలా..!

- Advertisement -

Chandrababu: వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు దాదాపు ఇద్దరూ ఒకేసారి రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇద్దరిదీ ఒక విధమైన అనుబంధం కొనసాగింది. మొదట్లో ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన అనంతరం వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారు. మరి ఆ సమయంలో క్రిస్టియన్ భావాలు అనుసరించే వైఎస్సార్ డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు చేయలేదు?.. ఆనాడు వైఎస్సార్ తిరుమల వెళ్లి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కోరుతూ ఆ ఇష్యూని వివాదం చేయలేదు. మరి ఇప్పుడు కొత్తగా అసలు ఈ డిక్లరేషన్ అన్నది ఎందుకు సమస్యగా మారిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి 2009లో తిరుమల వెళ్లారు. ఆ సమయంలో జగన్ ఎంపీగా ఉంటూ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పినట్లుగా ఒక ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. ఏది ఏమైనా అసలు జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలన్న ఇష్యూ ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారనేది ఇప్పుడు చర్చ. ఇది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యమే అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి గతంలో వైఎస్సార్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల సందర్శించడం వెనక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ చంద్రబాబుకు మిత్రుడు అని వదిలేశారా? లేదా రాజకీయాలకు కులమతాలను అంటగట్టకూడదని ఆలోచించారా? అనేది అర్థం కాని విషయం. ఎక్కడైనా ఎప్పుడైనా రూల్స్ అంటే రూల్స్ మరి. అప్పుడు లేని ఈ వివాదం ఇప్పుడు ఎందుకు వస్తోంది. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని, తనకు లాభం లేనిదే ఏ పనీ చేయడని, ఆఖరికి దేవుడిని కూడా వదలడని స్పష్టమవుతోంది. మొత్తానికి తన అనుకూలత బట్టి చంద్రబాబు ప్రవర్తన ఆధారపడి ఉంటుందని, తనకు లబ్ది లేకపోతే ఎందులోనూ తలదూర్చడని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఒక మనిషి అసలు సీఎం పదవికి ఎలా అర్హుడు అవుతాడని నిలదీస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!