Monday, February 10, 2025

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగడం వెనుక జగన్.. కూటమికి మింగుడు పడలే!

- Advertisement -

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందా? అదంతా టీడీపీ కూటమి కృషి ఫలితమా? లేకుంటే అంతకుముందు జగన్ అసెంబ్లీలో ఇచ్చిన తీర్మాన ఫలితమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. కేంద్ర ఆర్థిక శాఖ క్యాబినెట్ కమిటీ స్టీల్ ప్లాంట్ కు ఏకంగా 117000 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ లేదని తేలిపోయింది. దీంతో ఇదంతా తమ పోరాట ఫలితమేనని టిడిపి కూటమి చెబుతోంది. కానీ ఈ విషయంలో వాస్తవ పరిస్థితిని తెలియజేశారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ఇందులో గత వైసిపి ప్రభుత్వ కృషి ఉందని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 35 వేల కోట్ల రూపాయల నష్టంతో నడుస్తోంది. దీనిని ప్రైవేటీకరణ చేసి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని కేంద్రం ఆలోచన చేసింది. వైసిపి ప్రభుత్వ హయాంలోనే ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవడంలో వైసిపి సర్కార్ వైఫల్యం చెందిందని టిడిపి తో సహా కూటమి పార్టీలు ఆరోపణలు చేశాయి. ఎన్నికల్లో ప్రచార అస్త్రం గా మార్చుకున్నాయి. ప్రజలకు కూడా ఈ విషయంలో కొంతవరకు విశ్వసించారు. కూటమి పార్టీలు వస్తే ప్రైవేటీకరణ అంశం అడ్డుకుంటాయని ప్రజలు బలంగా భావించారు. కూటమి పార్టీలకు మద్దతు తెలిపారు. అంతులేని విజయంతో కూటమి పార్టీలు అధికారాన్ని చేపట్టాయి.

మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చారు. దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటి కరణ అంశంపై మారు మాట చెప్పలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు పెరిగాయి. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని అంతా భావించారు. కానీ ఈరోజు అదే స్టీల్ ప్లాంట్ కు 11700 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రత్యేక ప్రకటన చేశారు. కరోనా విపత్కర సమయంలో సైతం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నడిచిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో వైసిపి పై విశప్రచారం చేసింది కూటమి. కానీ నాడు జగన్ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందన్న విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి కుమారస్వామి వెల్లడించారు. ఒక విధంగా ఇది కూటమి పార్టీలకు ఇబ్బందికరమే. స్టీల్ ప్రైవేటీకరణ నిలిచిపోవడం తమ ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఎంతో ఆరాటపడతారు. కానీ సంబంధిత కేంద్రమంత్రి కుమారస్వామి ఈ విషయంలో జగన్ సర్కార్ ప్రస్తావన తేవడం మాత్రం వారికి జీర్ణించుకోలేని అంశం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!