Ys jagan :కుట్ర కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వరద బాధితుకు కూటమి నేతలు ఏం చేశారని నిలదీశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పబ్లిసిటీ కోసం పోజులు కొడుతున్నారు తప్ప… పరిష్కారం కోసం పాటు పడటం లేదని మండి పడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజలు కోసం ఏం చర్యలు తీసుకోలేదని అన్నారు. గత వైసీపీ హయాంలో జగన్ సంస్కరణలే ప్రజలను గట్టెక్కిస్తున్నాయని స్పష్టం చేశారు. చీటికి మాటకి గత ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న బాబు, పవన్, కూటమి నేతలు వదర బాధితులకు ఏం చేయగలరో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వదర బాధితులకు జగన్ తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థే ఉపయోగపడ్డాయి. జగన్ తీసుకొచ్చిన 108, 104 వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ హెల్త్ సెంటర్లే ఇవాళ వరద బాధితులను గట్టెక్కిస్తున్నాయి. బాబు, పవన్, కూటమి నేతలు బాధితులకు చేసిందేమైనా ఉందా అంటే అదీ లేదు. కొంతమంది దాతలు, స్వచ్చంధ సంస్థలే తప్ప ఏం కనిపించే పరస్థితి లేదు. కేంద్రం సాయం చేస్తే చేతులు దులుపుకుందామని చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
———————- హరీష్ —————————-
Ys jagan : జగన్ కు పెరుగుతున్న క్రిడిట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -