Saturday, October 5, 2024

Kcr:గేర్ మార్చిన కేసీఆర్.. స్థానిక ఎన్నికలతో పూర్వ వైభవం దిశగా..

- Advertisement -

Kcr:కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని మార్చనున్నారా? పాత కేసీఆర్ ను తెరపైకి తేనున్నారా? వ్యూహాలతో ముందడుగు వేయనున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలతో పూర్వ వైభవం తీసుకురానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తూ మరోసారి తెలంగాణ ప్రజల మనసు గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు ప్రజా పోరాటాలు చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 11న పార్టీ శ్రేణులతో సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్ తో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఓటమితో పాటు బీఆర్ఎస్ పార్టీకీ ప్రజలకు మధ్యన గ్యాప్ ఎక్కడ వచ్చింది అని గులాబీ బాస్ కూలకుషంగా పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. అయితే ఇవేవీ తెలుసుకొని విపక్షాలు కేసీఆర్ పై రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ తప్పా మరో పార్టీకీ స్థానం లేదని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. వారి మాటలు చూస్తున్న తరుణంలో చాలా మంది కూడా అదే నిజం కాబోతుంది అనుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయమై..బీఆర్ఎస్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక స్పష్టత వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో తమకు తిరుగులేదు అనుకున్న బీఆర్ఎస్ కు ప్రజలు ఎన్నికల్లో పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణలో నెంబర్ వన్ అని చెప్పుకునన్న బీఆర్ఎస్ ను ప్రజలు ఎందుకు దూరం పెట్టారు. నిజంగా ఈ ఓటమి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒక రకంగా తీవ్రంగా కృంగిపోయేలా చేసిందని చెప్పవచ్చు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారని తన వద్దకు వచ్చిన నేతలతో పదే పదే ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్.

అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా స్వరూపమే మారిపోయింది.దాదాపు కేసీఆర్ పార్టీని పక్కన పెట్టేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పార్టీ లోక్ సభలో ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ నేతల నుంచి క్యాడర్ దాకా పూర్తి నైరాశ్యంలో పడిపోయారు. ఇది ఒక వైపు ఉంటే మరోవైపు పార్టీలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొరొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకు జంప్ అవుతానే విషయం తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.సాక్షాత్తు గులాబీ బాస్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యేలు పార్టీనీ వీడడం కేసీఆర్ తో సహా పార్టీనీ విస్మయానికి గురి చేసింది.

అయితే బీఆర్ఎస్ కు అనూహ్యంగా కొన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. ప్రజల్లో కూడా కేసీఆర్ పార్టీపై సానుకూలతలు కలిగేలా పరిస్థితులు దోహదపడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేయకపొవడం కేసీఆర్ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులు ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ ట్రాక్ లో పడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టింది. దీనిలో బీఆర్ఎస్ కూడా యాక్టివ్ గా పాల్గొంది. యువత నుంచి బీఆర్ఎస్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ కన్నా అప్పటి బీఆర్ఎస్ కొంత మేర నయం అనే టాక్ యూత్ నుంచి రావడం ప్రారంభమైంది. ఇదే అదనుగా బీఆర్ఎస్ కూడా యువత ఆందోళనలనో యాక్టివ్ గా ఉంటూ వారికి మరింత చేరువయ్యేందకు ప్రయత్నాలు ప్రారంభించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ సత్తాచాటాని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కవగా గ్రామీణ ప్రాంతాల్లోనే. రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలకు రేవంత్ హామీలు ఇచ్చారు. కానీ అమలులో కొంత జాప్యం జరిగింది. మరికొందరికి మొండి చేయి దక్కింది. ఫలితంగా ఇది ప్రభుత్వంపై ప్రతికూలత చూపే అంశమే. పైగా బీఆర్ఎస్ హయాంలో ఇదే అంశాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. దీంతో దానిపై ఎదురు వ్యూహాన్ని రచిస్తున్నారు కేసీఆర్. నిరుద్యోగుల అంశాన్ని చుట్టూ పోరాటం చేయడానికి డిసైడ్ అయ్యారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి. దీంతో స్థానిక సంస్థల్లో సత్తాచాటి పూర్వ వైభవాన్ని సాధించాలని భావిస్తున్నారు గులాభీ బాస్.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!