Ys jagan:ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన వైఎస్సార్సీపీ తర్వాతి ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో నేతలు పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక పదవులకు నియామకాలు చేపడుతూ జగన్ సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. 2029 ఎన్నికలలో ఖచ్చితంగా వైసీపీని గెలిపించి తీరుతామన్న ధీమా జగన్‌లో కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల ఫలితాల బట్టి రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా.. ఓట్ల శాతం ఏకంగా 40 వరకు ఉంది. ఇదే ఇప్పుడు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాకు కారణంగా తెలుస్తోంది. ఇదే లెక్క ప్రకారం గతంలో పరిశీలిస్తే.. 2019 ఎన్నికలలో 23 సీట్లు వచ్చిన టీడీపీకి కేవలం 39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరి అదే వైసీపీకి 11 సీట్లు వచ్చినా.. ఏకంగా 40 శాతం ఓట్లు రావడం గమనార్హం.
సరైన పాలనా పద్ధతుల్లో నడవని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ మరింత పుంజుకుంటుంది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వైసీపీకే అధికారాన్ని కట్టబెడతారని వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే.. ఏపీలో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసినా అంత ప్రభావం కనిపించదు. ఇటు జనసేన ప్రభావం కూడా అంతంత మాత్రమే. ఆ పార్టీ కొన్ని జిల్లాల్లో బలంగా ఉన్నా పూర్తిస్థాయిలో మాత్రం నెట్టుకురాదు అనడంలో సందేహమే లేదు. ప్రజల్లో ఇప్పుడు వైసీపీపై ఉన్న అభిమానాన్ని ఇలాగే కొనసాగేలా చూస్తే 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టే అవకాశం ఖచ్చితంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.