Saturday, October 5, 2024

Pawan- Ambati:పవన్‌కు అంబటి సవాల్.. చంద్రబాబుని ఖాళీ చేసి పంపాలని డిమాండ్

- Advertisement -

Pavan- Ambati:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు వచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కి వైసీపీ నుంచి గట్టి సవాలు ఎదురైంది. చెరువులు, వాగులు, వంకలు కట్టి ఆక్రమణలు చేయడం వల్లనే భారీ వరదలు వచ్చాయన్న పవన్ వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే స్పందించింది. బుడమేరు పొంగినందుకు కారణాలు చెబుతూ అక్కడ ఆక్రమణల మీద మాట్లాడిన పవన్‌కు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా అని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. బఫర్ జోన్‌లో చంద్రబాబు కరకట్ట ఇల్లు ఉందని గుర్తు చేసిన అంబటి.. మరి చంద్రబాబుని కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి పంపించగలరా అంటూ సవాల్ చేశారు. అసలు ఈ విషయం ముందు పవన్‌కు తెలుసా అని నిలదీశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రజల బాధలు పట్టని పవన్.. చంద్రబాబు ఇల్లు వరద నీటిలో మునగడం వల్లే ఇప్పుడు వరదల సమస్య గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వల్లే ఈ వరదలు ఇంత భారీ స్థాయిలో వచ్చాయని అంబటి అన్నారు. ముందస్తు చర్యలు లేకపోవడం, వరద తీవ్రతను అంచనా వేయకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందని విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ రోజు రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ వస్తే కానీ, పవన్‌లో చలనం రాలేదని, తాను డిప్యూటీ సీఎం అని గుర్తుకు రాలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వరదల సమయంలో సీఎం జగన్ చాకచక్యంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు సరైన రక్షణ కల్పించే విషయంలో అనుసరించిన విధానాలు చూసైనా టీడీపీ కూటమి నేర్చుకోవాల్సిందని అంబటి హితవు పలికారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!