Sunday, March 16, 2025

లోకేష్ స్థానంలో నారా బ్రాహ్మణి.. టిడిపిలో కీలక పదవి!

- Advertisement -

టిడిపిలో యువరక్తం ఎక్కించేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారా? లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రకరకాల సమీకరణలకు తెరతీస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కానీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చిన్నపాటి అసంతృప్తి ఉంది. అయితే భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టిడిపి స్వతంత్రంగా ఎదగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నబాబు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. లోకేష్ కు పార్టీలో పదోన్నతి కల్పించాలని చూస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ.. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ చేయాలని చూస్తున్నారు. అయితే ఒక్క లోకేష్ ను ప్రమోట్ చేయడం కాదు. చుట్టూ ఒక టీంను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో భవిష్యత్తులో నందమూరి కుటుంబం నుంచి పోటీ రాకుండా చూడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తో పాటు కోడలు బ్రాహ్మణిని ప్రయోగించేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మే నెలలో కడప జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇంతలోపే లోకేష్ ను ప్రమోట్ చేయడంతో పాటు చుట్టూ భారీ వలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు.

లోకేష్ విషయంలో ఆది నుంచి చంద్రబాబు పక్క ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని హస్తగతం చేసే క్రమంలో నందమూరి కుటుంబాన్ని వాడుకున్నారు. అదే సమయంలో తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును బలంగా నమ్మి మోసపోయారు. అయితే పార్టీని హస్త గతం చేసుకున్న చంద్రబాబు సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీని నడపగలిగారు. రాజకీయాల్లో సైతం చురుకైన పాత్ర పోషించగలిగారు. భవిష్యత్తు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకున్నారు. తన సమర్థతతో తెలుగుదేశం పార్టీని నడిపించి అందరి అభిమానాలను పొందగలిగారు. అయితే తనకున్న చతురత కుమారుడు లోకేష్ లో కనిపించకపోవడంతో ఆయనను ప్రమోట్ చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త ఆలోచనతో చంద్రబాబు ముందుకు సాగాలని భావిస్తున్నారు.

లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారన్న కామెంట్స్ ఉన్నాయి. 2009లో పార్టీ కోసం ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి గెలవలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై వ్యతిరేక ప్రచారం వచ్చేలా చంద్రబాబు పావులు కదిపారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయిందని ప్రచారం చేశారు. క్రమేపీ తారక్ ను సైట్ చేశారు. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సహకారం లేకుండానే అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో సైతం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని తారక్ తో ఎటువంటి ప్రచారం చేయలేదు. ఈ ఎన్నికల్లో అయితే తారక్ అవసరం లేకుండానే అధికారంలోకి రాగలిగారు. అయితే భవిష్యత్తులో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు చూడకుండా ఉండేందుకు గట్టి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నందమూరి కుటుంబ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల్లో లోకేష్ కు పార్టీలో ప్రమోట్ చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే లోకేష్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. లోకేష్ కాళీ చేయబోతున్న ఈ స్థానంలో నందమూరి బాలకృష్ణకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే చంద్రబాబు తాజాగా వేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం పోటీకి రాకుండా ఉండేందుకు గాను జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టులో నారా బ్రాహ్మణుని నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే నందమూరి కుటుంబాన్ని ట్రాప్ చేసి చంద్రబాబు పార్టీని నడుపుతున్నారన్న టాక్ ఉంది. దానిని అధిగమించేందుకే బ్రాహ్మణిని చంద్రబాబు ప్రయోగిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి బాలకృష్ణ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే త్వరలో నారా బ్రాహ్మణి టిడిపి జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులు కావడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!