వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త రాజకీయ వ్యూహకర్తలు అందుబాటులోకి రానున్నారా? మార్చి రెండవ వారం నుంచి వారు సేవలందించనున్నారా? ఇకనుంచి వైసీపీ దూకుడు ప్రదర్శించనుందా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘకాలంగా సేవలందిస్తోంది ఐ పాక్. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం వైసీపీతో ఒప్పందం కుదుర్చుకుంది. సరిగ్గా 2018 జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు పరిచయం చేశారు ప్రశాంత్ కిషోర్ ను. నాటి నుంచి పీకే నేతృత్వంలోని ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పటి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో బలమైన చైతన్యం తీసుకురావడంతో 2019 ఎన్నికల్లో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. తన గెలుపులో సింహభాగం ఐప్యాక్ ప్రభావితం చేసిందని బలంగా నమ్మారు జగన్. గత ఐదేళ్లపాటు ఐపాక్ టీం సేవలను కొనసాగించారు. కానీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అయినా సరే ఐ ప్యాక్ టీమును ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు.
ఐపాక్ టీంకు నేతృత్వం వహించేవారు ప్రశాంత్ కిషోర్. 2019 కి ముందు దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు సేవలు అందించారు. దాదాపు ఓ పది రాష్ట్రాలకు తన రాజకీయ వ్యూహాలను అందించగలిగారు. తనను నమ్ముకున్న పార్టీలను అధికారంలోకి తేగలిగారు. 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాకు చేరువయ్యారు. దాదాపు అధికార పక్షానికి దగ్గరయ్యారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఎన్నికల వ్యూహకర్తకు నమ్ముకొని ఉంటే తప్పకుండా అధికారంలోకి వచ్చే వారం అని బలంగా నమ్మారు. కానీ ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడంతో.. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం తో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు.
అయితే 2019 ఎన్నికలు అనంతరం రాజకీయ వ్యూహకర్త వృత్తికి గుడ్ బై చెప్పారు ప్రశాంత్ కిషోర్. స్వరాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే అప్పటివరకు ఐపాక్ టీం లో సహచరులుగా రుషిరాజ్ సింగ్, రాబిన్ శర్మ, శాంతం ఉండేవారు. ప్రశాంత్ కిషోర్ నిష్క్రమణతో వైసీపీకి ఐపాక్ టీం సేవలు కొనసాగాయి. కానీ రాబిన్ శర్మతోపాటు శాంతాన్ ఐ ప్యాక్ టీం ను వీడారు. సొంతంగా తాము ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆ ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి సేవలందించారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన శాంతాన్ వైసిపి వ్యూహకర్త బృందంలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. వైసీపీ ఆవిర్భావం మార్చి 12 నుంచి సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అయితే గత ఐదేళ్లుగా వైసీపీకి సేవలందించిన ఐప్యాక్ బృందంపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఐపాక్ తీరు కూడా ఒక కారణమైన విశ్లేషణ ఉంది . అయితే ఇప్పుడు అదే ఐప్యాక్ సేవలు వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు వ్యతిరేకించిన ఐప్యాక్ బృందానికి జై కొడుతున్నారు. అయితే మునుపటిలా ఐప్యాక్ కు ఎటువంటి స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు అదే బృందంలోకి టిడిపి వ్యూహకర్త శాంతన్ చేరే అవకాశం ఉంది. గత మాదిరిగా వందలాది బృందంతో ఐపాడ్ ఉండదు. ప్రతి ఉమ్మడి జిల్లాలకు ఇద్దరు ముగ్గురు చొప్పున మాత్రమే ఐపాక్ ప్రతినిధులు ఉంటారు. వారే సేవలందిస్తారు. మొత్తానికి అయితే మార్చి రెండవ వారంలో ఐప్యాక్ బృందం వైసీపీ సేవల్లో పూర్తిస్థాయి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.