Sunday, March 16, 2025

నాలుగు రోజులుగా కనిపించని పవన్ కళ్యాణ్.. అనారోగ్యమే కారణమా? నిజం ఎంత?

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కనిపించడం లేదు ఎందుకు? ఆయన ఎక్కడకు వెళ్లారు? ఏం చేస్తున్నారు? సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారా? ఢిల్లీ పర్యటనకు వెళ్లారా? అసలు ఏం జరుగుతోంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత నాలుగు రోజులుగా పవన్ గురించి ఎటువంటి ప్రస్తావన మీడియాలో లేదు. ఆయన కార్యక్రమాల వివరాలు తెలియడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పాలనను వదిలేసి సినిమా షూటింగ్లకు వెళ్లారని ప్రచారం ప్రారంభమైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన ఒక కీలక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని.. గత నాలుగు రోజులుగా అస్వస్థతకు గురయ్యారని.. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే ప్రతి నెల, రెండు నెలలకు ఒకసారి ఇటువంటి ప్రకటన వస్తూనే ఉంది. దీంతో ఈ ప్రకటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి అదే సమయం పడుతుంది. అయితే ఏపీకి ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి. కానీ 2024 సంక్రాంతి సమయానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అప్పటినుంచి సినిమాలకు దూరమయ్యారు. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెలలో ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రతి నెలకు, రెండు నెలలకు ఒకసారి పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. దానికి జనసేన చూపుతున్న కారణం అనారోగ్యం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిత్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వస్తోంది. సినిమా షూటింగులు విషయంలో రకరకాలుగా చిత్ర యూనిట్లు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు హాజరవుతున్నట్లు అధికారిక ప్రకటన లేకుండా పోతోంది. అంటే పవన్ కళ్యాణ్ కనిపించని ప్రతిసారి ఆయన సినిమా షూటింగ్లకు హాజరవుతున్నట్టే కదా.

హరిహర వీరమల్లు, ఓజీ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. కానీ ఆ చిత్రాల షూటింగులు గత ఏడాది కాలంగా నిలిచిపోయాయి. గత సంక్రాంతి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారారు. తొలుత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తరువాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. కనీసం ఆయన సినిమా షూటింగ్లకు వెళుతున్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. అయితే మధ్య మధ్యలో ఆయన కనిపించకుండా మానేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తుంటే అనారోగ్యమని ప్రకటన వస్తోంది. కానీ ఆయన సినిమా షూటింగ్ల కోసమే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానం ఉంది. కానీ దానిని నివృత్తి చేసే ప్రయత్నం చేయడం లేదు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో బాధ్యతాయుతమైన నేత. ఏ విషయాన్ని అయినా క్లారిటీగా చెప్పాలి. కానీ అప్పుడప్పుడు ఆయన నాలుగు నుంచి వారం రోజులు పాటు కనిపించకుండా మానేస్తున్నారు. అది సినిమా షూటింగ్ ల కోసమేనన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కానీ ఆ విషయాన్ని ఆయన బయటపెట్టడం లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ప్రజలకు నిజాలు చెప్పాలి. కానీ పవన్ మాత్రం సినిమా షూటింగ్ల విషయంలో నిజాలను దాచి వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కానీ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని జనసేన ఒక ప్రకటన జారీ చేసింది. అయితే ఇలాంటి ప్రకటనలు జనసేనకు కొత్త కాదు. గత ఏడు నెలలుగా ఇటువంటి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా జనసేన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఉన్న రేపిటేషన్ తగ్గే అవకాశం ఉంది. ఇక ఆలోచించుకోవాల్సింది జనసేన పార్టీయే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!