Wednesday, March 19, 2025

ఐదేళ్లపాటు పవర్ ఎంజాయ్.. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే పత్తాలేని ఆ ఇద్దరు సీనియర్లు!

- Advertisement -

ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు దక్కించుకున్నారు ఆ జిల్లా నేతలు. కానీ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు.. పా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులను కూడా పట్టించుకోవడం లేదుర్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇంతకీ వారు పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? ఇంతకీ ఆ జిల్లా ఏది? ఎవరా నేతలు? తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ.

శ్రీకాకుళం జిల్లా కూల్ కూల్ గా ఉంటుంది. కానీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి ఎనిమిది చోట్ల ఘనవిజయం సాధించింది. 2014లో మాత్రం మూడు స్థానాలకు పరిమితం అయింది. ఆది నుంచి టిడిపి అనుకూల జిల్లా కావడంతో జగన్మోహన్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత తమ్మినేని సీతారాం కు స్పీకర్ పదవి కట్టబెట్టారు. మరో సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ కు మంత్రిగా చాన్స్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకు క్యాబినెట్లో చోటిచ్చారు. క్యాబినెట్ విస్తరణలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కు అమాత్య పదవి దక్కింది. ఐదేళ్లపాటు పదవులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. కానీ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి కనిపించకుండా మానేశారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ముఖం చాటేస్తున్నారు.

ఉత్తరాంధ్రలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. 1989 లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయుడు కూడా. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ధర్మాన ప్రసాదరావు అన్ని తానై వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలుగు గారు ధర్మాన. 2009 ఎన్నికల్లో సైతం రెండోసారి గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు ఏకంగా రెవెన్యూ శాఖనే కట్టబెట్టారు. ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు రాజశేఖరరెడ్డి. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన పరిస్థితుల్లో బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ మాత్రం జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు ధర్మాన ప్రసాదరావు. అయినా సరే వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ధర్మాన సోదరులు ఇద్దరు ఓడిపోయారు.

2019 ఎన్నికల్లో ధర్మాన సోదరులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో విధేయతకు పెద్దపీట వేస్తూ ధర్మాన కృష్ణ దాస్ కు అవకాశం ఇచ్చారు జగన్. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ధర్మాన ప్రసాదరావు మనస్థాపానికి గురయ్యారు. సుమారు రెండేళ్ల పాటు పార్టీ పట్ల అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. మంత్రివర్గ విస్తరణలో ధర్మాన కృష్ణదాస్ ను తప్పించి సోదరుడు ప్రసాద్ రావుకు ఇచ్చారు. అప్పుడు కూడా కీలకమైన రెవెన్యూ శాఖను ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ధర్మాన కనిపించకుండా మానేశారు. పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం లేదు. సమావేశాలకు హాజరు కావడం లేదు.

ఇక సీనియర్ నేత తమ్మినేని సీతారాం సైతం అదే బాటలో ఉన్నారు. ఎప్పుడో చివరిసారిగా 1999 ఎన్నికల్లో గెలిచారు తమ్మినేని. అటు తరువాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. దాదాపు ఫేడ్ అవుట్ అయ్యారు. అయినా సరే ఆయన సీనియారిటీని గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. అయినా సరే తమ్మినేని కి ఓటమి పలకరించింది. అయినా సరే తమ్మినేని పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తమ్మినేని గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. అయితే ఏకంగా అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చారు జగన్. ఐదేళ్లపాటు ఆ పదవిని అనుభవించారు. ఈ ఎన్నికల్లో ఆయనపై వైసీపీ క్యాడర్ వ్యతిరేకంగా ఉన్నా.. మూడోసారి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన గెలవలేకపోయారు. దీంతో ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్చార్జిగా ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ ను నియమించారు జగన్. దానిని తట్టుకోలేకపోతున్నారు తమ్మినేని. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

మరోవైపు సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ మాత్రం జగన్ నాయకత్వాన్ని అనుసరిస్తున్నారు. మరోవైపు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇచ్చారన్న కృతజ్ఞతతో డాక్టర్ సిదిరి అప్పలరాజు సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం మాత్రం ముఖం చాటేస్తున్నారు. వారి విషయంలో సీరియస్ యాక్షన్ లోకి దిగాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!