శ్యామ్ ఆత్మహత్య వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధం.. ప్రేమ వ్యవహారం, చదువుల్లో వెనుకబాటుతనమే శ్యామ్ ఆత్మహత్యకు కారణం.
కోనసీమ జిల్లాకు చెందిన శ్యామ్(20) అనే యువకుడు తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు.
పోలీసులు దర్యాప్తు, వైద్యుల నివేదిక ప్రకారం… మృతుడు శ్యామ్ జూన్ 25 సాయంత్రం 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటలలోపు చనిపోయి ఉంటాడని వైద్యులు నిర్ధారించారు. శ్యామ్ చేతి మణికట్టును బ్లేడుతో కోసుకున్నట్టు వైద్యులు గుర్తించారు. అందుకు వాడిన బ్లేడును అతడి జేబులోనే దొరికింది. మణికట్టును కోసుకున్న అనంతరం ఉరేసుకుని చనిపోయి ఉంటాడని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
అతడి చావుకు ప్రేమ వ్యవహారంతోపాటు, చదువుల్లో వెనకబడి ఉండటమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది..