Wednesday, March 19, 2025

అవంతి.. ఏంటీ గతి?

- Advertisement -

ఆయన పొలిటికల్ జర్నీ ఇప్పటివరకు సేఫ్ గా సాగింది. పట్టిందంతా బంగారంగా మారింది. అధికార వాసనను చూసి ఆ పార్టీలో చేరిపోయేవారు ఆయన. కానీ ఈసారి అలా కుదరలేదు. ఓటమి ఎదురయ్యేసరికి అధికార పార్టీలోకి దూకడానికి సిద్ధపడ్డారు. కానీ అది సైతం వీలుపడడం లేదు. దీంతో పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డారు ఆయన. ఇంతకీ ఆయన ఎవరు? ఏంటా కథ? అంటే వాచ్ దిస్ స్టోరీ.

అవంతి శ్రీనివాసరావు.. పరిచయం అక్కర్లేని పేరు. తన ఇంటి పేరిట విద్యాసంస్థలను నెలకొల్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు. విద్యా సంస్థల అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆపై మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. వరుసగా అధికార పార్టీని చేరువ అవుతూ.. పొలిటికల్ పవర్ మజాను అనుభవించారు. కానీ ఫస్ట్ టైం ఓటమి ఎదురయ్యేసరికి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాస్. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా.. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి పిలుపుమేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొద్ది రోజులకే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అప్పట్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు అవంతి శ్రీనివాస్.

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ సమయంలో తన గురువు గంటా శ్రీనివాసరావు ద్వారా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు అవంతి. చంద్రబాబు అవంతి సేవలను గుర్తించి అనకాపల్లి ఎంపీ సీటును ఇచ్చారు. అప్పట్లో టిడిపి వేవ్ తో అనకాపల్లి ఎంపీగా గెలిచారు అవంతి. అలా లోక్సభలో అడుగు పెట్టారు. ఐదేళ్లపాటు పవర్ అనుభవించారు.

ఒకవైపు టిడిపి ఎంపీగా ఉంటూనే వైయస్సార్ కాంగ్రెస్తో రాయబారాలు నడిపారు అవంతి శ్రీనివాస్. గురువు గంటా శ్రీనివాస్ తో ఉంటే తాను మంత్రిని కానని అంచనాకు వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టారు. అలాగే తాను భీమిలి నుంచి గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జగన్ తొలి క్యాబినెట్లో మంత్రి అయ్యారు అవంతి.

మూడేళ్ల పాటు మంత్రిగా పవర్ ఎంజాయ్ చేశారు అవంతి. కానీ మంత్రివర్గ విస్తరణలో అవంతి మంత్రి పదవిని తొలగించారు జగన్మోహన్ రెడ్డి. అది మొదలు అసంతృప్తికి గురయ్యారు. అయినా సరే భీమిలి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. భారీ ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అధికార తెలుగుదేశం కానీ.. జనసేనలో కానీ చేరాలని భావించారు.. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయేసరికి పొలిటికల్ జంక్షన్ లో ఉండిపోయారు. విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సరైన సమయం చూసి అధికార పార్టీలో చేరాలని చూస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!