Bigg Boss 8 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ సీజన్ 8తో మరో సారి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్లు హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అందరిలో కంటే నాగ మణికంఠ డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఫస్ట్ వీక్ టెన్షన్ భరించలేక ఎమోషనల్ అయి విగ్గు స్ట్రోక్ ఇచ్చిన మణికంఠ.. ఆ స్ట్రోక్ కి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. తర్వాత మెల్లగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరితో కలిసిపోతూ జనాలను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో మణికంఠ అందరినీ టార్చర్ చేసే యష్మీ చేతనే శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాదు అర్థరాత్రి దొంగతనాలు చేస్తూ ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత తన ఆట, మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచిన మణి నిన్నటి ఎపిసోడ్‌లో స్పెల్లింగ్ టాస్క్‌లో గెలిచి తన సత్తా చాటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లోనూ మణికంఠ స్ట్రాంగ్ ఫుటేజ్ ఇచ్చాడు. సాక్స్ టాస్క్‌లో మణికంఠ భయపడి అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఇదే విషయాన్ని అభయ్ కొంతమందితో కలిసి కూర్చుని చెబుతుండగా అది విన్న మణికంఠ నాకు భయం లేదని, నాకు చేతనైనంతలో ఆడాను అని చెప్పాడు. జోక్ చేయడానికి అందులో ఏమీ లేదు.. ముఖ్యంగా నా బాడీ మీద జోకులు వేయకండి.. నాకు మీ అందరితో కలవడం చాలా కష్టం. దయచేసి ఇలా చేయకండి అంటూ మండిపడ్డాడు.
ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ విషయంలో విష్ణుప్రియ డేర్ ని సెలెక్ట్ చేసిన వెంటనే మణికంఠ పోల్ డ్యాన్స్ చేయమని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా అందరిని ఓ రేంజ్ లో టార్చర్ చేసే యష్మినే కాసేపు ఆడుకున్నాడు మణికంఠ. యష్మీ.. మణికంఠ, భుజాలను మసాజ్ చేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పికిల్ బాటిల్ ఎక్కడ దాచావో చెప్పు ప్లీజ్ అంటూ యష్మీ మణిని బతిమిలాడుకుంది. ముందు కోపంతో కాకుండా ప్రేమతో మసాజ్ చేయ్ అన్నాడు మణికంఠ. ఆ సమయంలో పక్కనే ఉన్న నబీల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఎపిసోడ్‌కే హైలైట్. నా గురించి మూడు మంచి మాటలు చెప్పు’ అంటూ యష్మీ చేతే పొగిడించుకున్నాడు మణికంఠ. ఆ తర్వాత బీన్ బ్యాగ్ లో దాచిన పికిల్ బాటిల్ తీసి ఆమెకు ఇచ్చాడు. కానీ ఆ సమయంలో మణికంఠ పౌచ్ ను ప్రేరణ దొంగిలించింది. యష్మీ తీసిందేమో అనుకున్న మణి ఇచ్చేయమని కాసేపు బతిమిలాడాడు. కానీ యష్మీ మాత్రం తనకు అవకాశం వచ్చిందని.. ఓ పాట పాడి డ్యాన్స్ చేయ్ అంటూ యష్మీ మణికంఠను ఆట ఆడుకుంది. ఆ తర్వాత యష్మీని చూస్తూ ఫీలైపోయ్.. పాట పాడుతూ రేయ్ వాడు కసిగా ఉన్నాడు.. ఇచ్చేవే బాబు పౌచ్ అంటూ అక్కడి నుంచి పారిపోతుంది యష్మీ.. ఆపై యష్మీ టీమ్ ఉన్న గదిలోకి వెళ్లి మణికంఠ చిప్స్ ప్యాకెట్ దొంగిలిస్తాడు. ఇలా మొత్తానికి మొత్తమే ఈ దొంగల బ్యాచ్ ఎక్కడ దొరికింది బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.