Bigg Boss 8 : బిగ్ బాస్ షోలో గేమ్ ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తాను అనుకున్న విధంగా కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిస్తాడు. అందులో ఒకటి సీక్రెట్ రూం. హౌసులో నుంచి మనిషిని బయటకు పంపినట్లు చెబుతారు. కానీ ఆ కంటెస్టెంట్ మాత్రం అక్కడే ఓ సీక్రెట్ రూంలో ఉంటాడు. మిగతా కంటెస్టెంట్లు మాట్లాడుకునే మాటలన్నీ వింటుంటాడు. ఎవరు ఎలాంటి వారన్నది సదరు కంటెస్టెంట్ దాని ద్వారా తెలుసుకుంటారు. గొడవలు మొదలవుతాయి. ఆట మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ సీజన్లో కూడా అలాంటి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయి రెండు వారాలు పూర్తయి మూడో వారాంతం వచ్చింది. ఇక హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోలో 14మంది కంటెస్టెంట్లు.. రాగా అందులో ఇద్దరు కంటెస్టెంట్లు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సీక్రెట్ రూంకు పంపించారని సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అని ఆలోచిస్తున్నారా ? ఇంకెవరు యష్మి గౌడనే. బుల్లి తెరపై నాగభైరవి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన యష్మి… కృష్ణ ముకుంద మురారి సీరియల్ విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక అలాంటి ఈ నటి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి.. అందరికి చుక్కలు చూపిస్తోంది. మనసులో ఏం అనుకుంటే.. మైండ్ లో ఏం అనుకుంటే.. అది ఎవరు ఏం అనుకున్న సరే.. ముక్కుసూటిగా బల్లగుద్దినట్టు చెప్పేస్తుంది. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 8లో సైకోలా బిహేవ్ చేస్తున్న సోనియాను సైతం ముక్కుసుటిగా నువ్వు ఫేక్ అని ముఖం మీదే చెప్పేసింది.
ఆమె చెప్పే విధానం కాస్త కఠినంగా ఉన్నప్పటికీ.. టూ పేస్స్ తో అయితే లేదు.. ఏది ఉన్న డైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఇక అలాంటి యష్మి గౌడ తను చీఫ్ అయినప్పుడు కావాలనే ఆమె అందరిని ఇబ్బంది పెట్టిందని.. అందుకే ఆమె చీఫ్ గా ఓడిపోయిందంటూ మిగతా కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ చేశారు. దాంతో ఈ వీక్ గేమ్ మరి దారుణంగా ఆడింది. దీంతో ఆమెను ఈ వారం ఎలిమినేట్ చేసినట్టు.. ఆ తర్వాత ఆమెను వీకెండ్ ఎపిసోడ్ లో సీక్రెట్ రూంలోకి పంపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరీ ఆమె నిజంగా సీక్రెట్ రూమ్ కు వెళ్లిందా.. లేకపోతే నిజంగానే ఎలిమినేట్ అయిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఆమె సీక్రెట్ రూమ్ కు వెళ్లి ఉంటే మాత్రం ఆమెలో ఉన్న ఫైర్ తో కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తారనే చెప్పాలి.