బిగ్ బాస్ తెలుగు 8 ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్‌లోకి మరో రెండు మూడు వారాల తర్వాత 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని అనౌన్స్‌మెంట్ చేశాడు బిగ్ బాస్. ఇలా బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అని చెప్పేశాడు. బిగ్ బాస్ ప్రకటనతో హౌజ్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ కూడా కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఇచ్చాడు. ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ పెట్టే టాస్క్‌ల్లో గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలిగిపోతుందని, అలాగే విజేత ప్రైజ్ మనీలో రూ. లక్ష చేరుతుందని ప్రకటించాడు.
ఇది ఇలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8 లో ఎన్నడూ జరగనటువంటి గొడవలు జరుగుతున్నాయ్.. ఒకరి ఒకరు తిట్టుకుంటూ.. ఒకరినే అందరూ కలిసి టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ రచ్చ రచ్చ చేసేస్తున్నారు.. ఇక అలానే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అంతా ఓ కంటెస్టెంట్ ను టార్గెట్ చేయడంతో అతడు వాకౌట్ చేశాడు. అతను ఎవరో కాదు నాగమణికంఠ.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో సీతా క్లాన్ ఓడిపోగా నిఖిల్ క్లాన్ వారు సీత క్లాన్ లో ఒకరిని తదుపరి టాస్కుల్లో పాల్గొనకుండా తీసేయాల్సి ఉంది. ఆ సమయంలో సీత క్లాన్ నుంచి నబీల్ ను తీసేయడంతో ఇది అన్యాయం అంటూ అరుస్తారు మిగతా సీత క్లాన్ సభ్యులు.. అప్పుడు మా టీమ్ నుంచి మణికంఠ అతనంతట అతనే వెళ్లిపోయాడు.. ఇప్పుడు మేము నబీల్ ని తీసేసాం తప్పేంటి అని అడిగితే.. నాగమణికంఠ తనంతట తానే గేమ్ నుంచి బయటకు రాలేదు.. మీరు నలుగురు పంపించారు అని అనడంతో వాళ్లు మణికంఠ వైపు చూస్తే.. మణికంఠ కూడా నిజమే కదా అని ఏం మాట్లాడకుండా ఉంటారు.. ఇంకా అంతే గొడవ షురూ అవుతుంది.
నాగమణికంఠ నువ్వు మమ్మలను డబల్ ఫేస్ చేస్తున్నావ్.. వాళ్లు ఆ మాట అన్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి ఉండచ్చు కదా అంటే.. వాళ్లు చెప్పింది నిజమే కదా.. నా అంతట నేను గేమ్ నుంచి బయటకు రాలేదని అన్నావు.. అంతే.. ఆ మాటలకూ సీరియస్ అయినా నిఖిల్ క్లాన్ నాగమణికంఠను బాగా ఏడిపిస్తారు.. అతనికి పిచ్చెక్కేలా చేస్తారు.. దాంతో అతను నేను వాకౌట్ చేస్తున్న అంటూ మైక్ విసిరేసి హౌసు తలపులు కొడుతాడు.
నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ ను బయటకు వెళ్లిపోతానని కోరతాడు.. కాగా గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లో కూడా కొందరు కంటెస్టెంట్స్ ఈ షో వద్దు ఏం వద్దు అంటూ పారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ వారం ఓటింగులో నాగమణికంఠ మూడో స్థానానికి పడిపోయాడు. సోనియా ఆకులు చివరి స్థానంలో నిలవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే చాన్సులు పుష్కలంగా ఉన్నాయి.