Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 25 ఎపిసోడ్‌లో పృథ్వీ, సోనియా మినహా మిగిలిన వారందరూ కొత్త చీఫ్ సీత క్లాన్ లోకి వెళ్లాలని కోరుకున్నారు. అయితే సీత క్లాన్ నిండడంతో యష్మీ, నాగ మణికంఠలను నిఖిల్ క్లాన్ లోకి పంపారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించగా ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. ఎలాంటి అంచనాలు లేకుండా చివరి కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రిది హౌస్‌లోకి అడుగుపెట్టాడు. నబీల్ వరంగల్‌కు చెందిన యూట్యూబర్. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో విభిన్నమైన కంటెంట్‌తో వీడియోలు చేసేవాడు.
అయితే, బిగ్ బాస్ కంటే ముందు నబీల్ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు చాలా మందికి అతనే టైటిల్ ఫేవరేట్ గా మారిపోయాడు. తన ఆటతీరుతో రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా నాలుగో వారం నామినేషన్లతో ఒక్కసారిగా టైటిల్ రేసులోకి దిగాడు. అందరినీ హడలెత్తించే సోనియాను ఈ వారం ఓ రేంజ్ లో నామినేషన్లలో ఆడుకున్నాడు. సోనియాకు నబీల్ సరైన కారణాలను.. తన స్టైల్ లో చెప్పాడు. అప్పుడు చీఫ్ అయ్యే అవకాశం ఉన్న నబీల్.. సోనియా వల్ల మిస్సయ్యాడు. లేకుంటే నబీల్ చీఫ్ అయ్యేవాడు. తాను చీఫ్ కానప్పటికీ.. టాస్క్‌లలో నబీల్ తన సత్తా చాటుతున్నాడు. అందుకే ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డులు బద్దలు కొడుతూ అగ్రస్థానానికి ఎగబాకుతున్నారు.
అయితే, బిగ్ బాస్‌లో చేరడానికి ముందు నబీల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు హౌస్‌లోకి అడుగుపెట్టిన మూడు వారాల్లోనే అంటే దాదాపు 25 రోజుల్లోనే నబీల్ ఫాలోవర్ల సంఖ్య ఆరు లక్షల తొమ్మిది వేలకు చేరుకుంది. అంటే నబీల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి లక్షన్నర ఫాలోవర్స్‌ను ఎవరు సంపాదించుకోలేకపోయారు. ఇది కేవలం ఒక నబీల్‌కే సాధ్యపడింది. మేల్ కంటెస్టెంట్స్‌ను తన చుట్టూ తిప్పుకునే సోనియాకు బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్‌లో నబీల్ ఇచ్చిన కౌంటర్స్ చాలా మందికి తెగ నచ్చేసింది. ఆ ఒక్క నామినేషన్స్‌తో టైటిల్ విన్నర్ రేసులోకి ఎగబాగాడు నబీల్. అమ్మాయిలకు దూరంగా ఉండే నబీల్ మంచి మాటలతో, ఆటతీరుతో దూసుకుపోతున్నాడు. ఆటలు, టాస్క్‌లలో బెస్ట్ ఎఫర్ట్ ఇస్తూ మెప్పించాడు. అతని ప్రదర్శన ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ ట్రోఫీని నబీల్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.