BIGG BOSS 8: బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్, లిమిట్ లెస్ ఫన్ తో ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్అయ్యారు.. మూడో వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ పర్సన్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..గత వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి అనూహ్యంగా హౌస్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో శేఖర్ భాషది అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వారం అయినా సరైన ఎలిమినేషన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో పృథ్వీ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, అభయ్ నవీన్, నాగ మణికంఠ, నైనిక ఉన్నారు.
అన్ని ఆన్‌లైన్ ఓటింగ్ పోల్స్, అలాగే సోషల్ మీడియాలో టాక్ ప్రకారం, ఈ వారం పృథ్వీ లేదా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం టాస్క్‌లలో బిగ్ బాస్ పట్ల అభయ్ ప్రవర్తన, మర్యాద లేకుండా బిగ్ బాస్ ని అవమానించడం అతనికి చాలా ప్రతికూలంగా మారింది. అంతే కాదు నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున కూడా అతనికి రెడ్ కార్డ్ ఇచ్చాడు. వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు క్లాన్ చీఫ్ గా అభయ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కారణాలన్నీ అభయ్ ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ వారం అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఓటింగులో విష్ణుప్రియకు మొదటి రోజు నుంచే మంచి ఓటింగ్ వస్తూ నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. అలాగే, ప్రతిసారీ ఎమోషనల్ అవుతున్నప్పటికీ ఆటపరంగా మంచి పోటీ ఇస్తున్న నాగ మణికంఠ.. విష్ణు తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్రేరణ, సీత, యష్మీ గౌడలు మంచి ఓటింగ్ సాధించి సేఫ్ సైడ్ నిలుచున్నారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ మాత్రమే.
పృథ్వీ విషయానికి వస్తే.. టాస్క్‌ని బాగా ఆడినా, అవసరానికి మించి దూకుడుగా ఆడుతున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతేకాదు మధ్యమధ్యలో వల్గర్ లాంగ్వేజ్ కూడా వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి పృథ్వీ ఓటింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. పృథ్వీ, అభయ్ ఎలిమినేట్ కాకపోతే సీత, నైనికలలో ఒకరు అనూహ్యంగా వెళ్లిపోయే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వారం సీత, నైనికల ఆట విషయానికి వస్తే… సీత బాగా ఆడినా.. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక నైనిక అయితే నైనికా ఈ వారం చాలా తక్కువ కనిపించింది.