Bigg Boss 8: బుల్లితెరపై భారీ ప్రేక్షకాదరణ పొందిన రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రసారమై విశేష స్పందన అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ షో 8వ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలుగులో ప్రసారమైన ఆరవ సీజన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తర్వాత సీజన్ సెవెన్ ను ఉల్టా పుల్టా అనే సరికొత్త పద్ధతిలో ప్లాన్ చేసిన నిర్వాహకులు మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నారు.
ఏడో సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఆ సీజన్ కు మించి 8 సీజన్ ను నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. కానీ ఈ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న వారు పెద్దగా ఆదరణ పొందకపోవడంతో తొలుత ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. దీంతో ఈ కార్యక్రమంపై కూడా అంచనాలు కాస్త తగ్గిపోయాయి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాంచింగ్ ఎపిసోడ్ కు భారీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. షో ప్రారంభ రోజు 18.9 టీఆర్పీతో సంచలనం నమోదు చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత రేటింగ్స్ తెచ్చుకున్న షో మరొకటి లేదని స్టార్ మా వెల్లడించింది.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీజన్ ఈ స్థాయి రేటింగ్ సాధించలేదు. ఈ షోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని.. ప్రస్తుత భారీ టీఆర్పీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్న తీరుకు ఇదే నిదర్శనమని టీవీ వర్గాలు తెలిపాయి. ఈ షో ఫస్ట్ డే 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలో ఒక కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఐదో వారంలో కొంత మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.