Bigg Boss 8 : తెలుగు టెలివిజన్‌లో రకరకాల కాన్సెప్ట్‌లతో షోలు ప్రసారమవుతాయి. అయితే వాటిలో కొన్నింటికే ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తోంది. అలాంటి వాటిలో ఒకటి రియాలిటీ బేస్డ్ బిగ్ బాస్. ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చిన ఈ షోకు భారీ స్పందన వచ్చింది. దీంతో సీజన్ల మీద సీజన్లు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఎనిమిదో సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో వారం ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి!
బిగ్ బాస్ షోలో రకరకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, తగాదాలు, గ్రూపులు, రొమాన్స్, ప్రేమ, బాధ ఇలా అన్ని రకాల సన్నివేశాలను ఇందులో చూపించారు. ప్రస్తుత ఎనిమిదో సీజన్‌లో, అవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ తాజా సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటి వారం, శేఖర్ బాషా రెండో వారం, అభయ్ నవీన్ మూడో వారం ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పలు ఆసక్తికర వాదనలు జరిగాయి. ఇందులో కొందరు క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడి రెచ్చిపోయారు. ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ ఉన్నారు. నామినేషన్ల టాస్క్ ఒక్క ఎపిసోడ్‌కే పరిమితం కావడంతో ఎనిమిదో సీజన్ నాలుగో వారం ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఎవరూ ఊహించని రీతిలో సాగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఓటింగ్‌లో యువ సంచలనం నబీల్ అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత నాగ మణికంఠకు ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. వారి తర్వాత స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రేరణ మూడో స్థానంలో, ఆదిత్య నాలుగో స్థానంలో నిలిచారు. మరి ఈ ఓటింగ్ కొనసాగుతుందో లేదో చూడాలి. నాలుగో వారం ఓటింగ్‌లో పృథ్వీరాజ్ శెట్టి ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు. అలాగే, ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉన్నారు. బిగ్ బాస్ ముద్దుబిడ్డ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి అతి తక్కువ ఓట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.