Bigg Boss : బుల్లితెరపై టాప్ రేటింగ్స్ ఉన్న ఏకైక షో బిగ్ బాస్. ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ షో క్రేజ్ తెచ్చుకుంది. కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకుంది. ఇది విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఎనిమిదో సీజన్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రసారం అవుతుంది. అయితే బాలీవుడ్ లో 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ షో కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ఎవరు పాల్గొంటారోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అక్కడ జరగబోయే షోలో మహేష్ బాబు రిలేటివ్ ఎంట్రీ ఇస్తారనే టాక్ వస్తుంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు, తమిళ భాషలతో సహా బిగ్ బాస్ హిందీ సీజన్ 18 త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ నే హోస్ట్ గా చేస్తున్నాడు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ అతిథిగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రోమో ఇటీవల విడుదలైంది. అక్టోబర్ 6 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడూ సంచలనాలు, వార్తల్లో నిలిచే హిందీ బిగ్ బాస్ హౌసులోకి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారో చూడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఈ సీజన్‌లో అడుగుపెట్టనుందని టాక్.. అందులో నిజం ఎంతో తెలియదు. ఈ వార్త నిజమైతే ఆమెనే కచ్చితంగా విజేతగా నిలుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
శిల్పా శిరోద్కర్ తన కెరీర్‌ను భ్రష్టాచార్ చిత్రంతో ప్రారంభించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన పలు చిత్రాలు విజయం సాధించి కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచాయి. తెలుగులోనూ సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత సీరియల్స్‌లో మెరిసి చాలా సీరియల్స్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్న శిల్పా శిరోద్కర్ త్వరలో బిగ్ బాస్ షోలోకి అడుగుపెడుతుందా? లేదా? అనే చర్చ కూడా సాగుతోంది. శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ షోలో అడుగుపెడితే ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. శిల్పా శిరోద్కర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై కూడా చర్చ జరగడం గమనార్హం. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి మహేష్, నమ్రత 50 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా తన లుక్ మార్చుకుని కనిపించారు. ఆ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.