Tuesday, October 8, 2024

Bigg Boss Telugu 8: కన్ఫెషన్ రూంలో నాగార్జున సీరియస్ వార్నింగ్.. గుక్కపెట్టి ఏడ్చిన మణికంఠ

- Advertisement -


Bigg Boss Telugu 8: బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాల్టీ షో ద్వారా ఇండియాకి వచ్చిన బిగ్ బాస్.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో సక్సెస్ అయినా.. ఈ షో మన దగ్గర సక్సెస్ అయ్యే పరిస్థితులు లేవనే టాక్ మొదట్లో వినిపించింది. అయితే సందేహాలను నివృత్తి చేసి ఫస్ట్ సీజన్ తోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫలితంగా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే యాజమాన్యం వరుస సీజన్లు తీసుకొస్తున్నారు. తాజాగా ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించారు. ఈ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగ మణికంఠ అసభ్యంగా ప్రవర్తించడంతో అతడికి నాగార్జున షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

సాధారణంగా బిగ్ బాస్ షో ప్రారంభం కాగానే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది అన్ లిమిటెడ్ సీజన్, ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని కూడా అందిస్తుంది. గత వారం నామినేషన్ల సందడి సందడి చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యష్మీగౌడ, నాగ మణికంఠ మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ సీజన్‌లో ఎన్ని వారాలు ఉంటావొ ప్రతి వారం మణికంఠను నామినేట్ చేస్తానని చెప్పింది యష్మీ. ఇది హాట్ టాపిక్‌గా మారింది.

నామినేషన్ల సమయంలో గొడవ తర్వాత నాగ మణికంఠ యష్మీ గౌడ వద్దకు వెళ్లి వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. అంతేకాదు, ‘నామినేషన్ల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు’ అని అన్నారు. ఆ సమయంలో యష్మీ గౌడ చాలాసేపు ఏడుస్తూ కనిపించింది. అలాగే, ‘నేను కంఫర్డ్ గా లేకపోయినా నన్ను కౌగిలించుకున్నాడు’ అని చెప్పింది. దీనిపై నాగార్జున స్పందించారు. శనివారం ఎపిసోడ్‌లో, గత వారం చాలా ఊహించని సంఘటనలు జరగడంతో హోస్ట్ నాగార్జున కోపంగా కనిపించారు. అందరికీ క్లాస్ పీకాడు. ఇందులో భాగంగానే చివరిగా నాగ మణికంఠను కన్ఫెషన్‌ రూమ్‌ లోపలికి రమ్మన్నాడు. గతంలో మాదిరిగా కాకుండా అక్కడ అతడితోనే కొన్ని విషయాలను సీక్రెట్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది.

నాగ మణికంఠతో మాట్లాడిన తర్వాత నాగార్జున యష్మీగౌడతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను చూపించాడు. దీని గురించి మాట్లాడుతూ.. ‘మణికంఠ నువ్వు ఆమె కంఫర్ట్ లేకపోయినా హగ్ చేసుకున్నావు. ఇది మాత్రమే కాదు.. నీకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. కానీ మేము చూపించడం లేదు. నువ్వు షోకు ఎందుకు వచ్చావో ఆ పనే చూసుకో’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మణికంఠ ‘తప్పు సార్. ఇంకెప్పుడూ అలా జరగనివ్వను’ అన్నాడు. ఇప్పటికైనా ఆయనలో మార్పు వస్తుందో రాదో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!