Saturday, October 5, 2024

Big Boss 8 Telugu: నాగార్జున సాక్షిగా తెలుగు పరువు తీసిన కంటెస్టెంట్స్.. ప్రైజ్ మనీలో కోత

- Advertisement -

Big Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 చూస్తుండగానే వారం రోజుల గడిచిపోయాయి. షో మొదటి రోజు నుంచే హీట్ పెంచేసింది. చాలా మంది హౌస్‌మేట్స్ గొడవ పడ్డారు. మాటల తూటాలు పేల్చారు. ఈ క్రమంలో.. నామినేషన్ల క్రమం కూడా హాట్ హాట్ గా సాగింది. మొదటి వారంలో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో బేబక్క ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. గత ఏడు సీజన్ల కంటే ఈ సీజన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని హోస్ట్ నాగార్జున ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.

ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గెలుచుకునే ప్రైజ్ మనీ ని టాస్కులు ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న డబ్బులు ‘సున్నా’ అంటూ బిగ్ బాస్ షో ముందు రోజు ప్రకటించేశాడు. కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రైజ్ మనీ ని ఎంతవరకు తీసుకెళ్లారు అనేది ప్రతీ ఆదివారం నాగార్జున ప్రకటిస్తారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 6లో షో ప్రారంభమైన 50 రోజుల తర్వాత నాగార్జున మనీ ఎర్నింగ్ టాస్కుని కంటెస్టెంట్లకు ఇచ్చారు. కంటెస్టెంట్స్ కష్టపడి ఆడి ప్రైజ్ మనీ గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో ప్రారంభం నుండే ఆ పద్ధతినే అమలు చేశారు. అంటే ప్రతీ వారం కంటెస్టెంట్స్ ఆడే.. ఆట తీరుని బట్టి ప్రైజ్ మనీ పెరుగుతుందన్న మాట. అంటే గత సీజన్ లో లాగా 50 లక్షలు కాదు, అంతకు మించే ఉండొచ్చని నాగార్జున చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లే సీజన్ 8 ఎన్ ఫినిటీ సింబల్ ను ప్రమోట్ కూడా చేశారు. అంటే కంటెస్టెంట్లు వాళ్ల శక్తిమేరకు డబ్బులు సంపాదించుకుంటూ పోవచ్చన్నమాట.

అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఆట తీరు నాగార్జున కి బాగా నచ్చింది. అందుకు ఆయన వారి అకౌంట్లో 5 లక్షల రూపాయిలు ప్రైజ్ మనీ వేశారు. కానీ బిగ్ బాస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, హౌస్ లో ఎలాంటి తప్పులు చేయకూడదు. చేస్తే కచ్చితంగా వచ్చే ప్రైజ్ మనీ లో కోత ఉంటుంది. ఈ మాట చెప్పిన తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ గత వారం లో చేసిన తప్పులను మొత్తం ఒక వీడియో గా చేసి ప్లే చేశారు. ఆ వీడియో లో కంటెస్టెంట్స్ అందరూ అత్యధికంగా తెలుగుని కాకుండా ఇంగ్లీష్ భాషను ఎక్కువగా ఉపయోగించారు. దీనికి బిగ్ బాస్ హౌస్ నేను ఇచ్చిన 5 లక్షల రూపాయల్లో ఎంత కట్ చేసి ఉంటారు.,, మీరే ఊహించండి అంటూ నాగార్జున వరుసగా ఒక్కో కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో నెంబర్ చెప్తాడు. కానీ బిగ్ బాస్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నాగార్జున ఇచ్చిన 5 లక్షల నుండి 2 లక్షలు కట్ చేసి కేవలం మూడు లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ కి యాడ్ చేశాడు.

అంటే దాదాపుగా 50 శాతం కోత విధించాడన్నమాట. మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పొరపాటున కూడా ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా ఇక నుండైనా ఉంటారా?, లేదా ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రైజ్ మనీ ని తగ్గించుకుంటూ పోతారా అనేది చూడాలి. ఇంగ్లీష్ బాషా అనేది నేడు మన జీవితంలో నిత్యకృత్యం అయిపోయింది. సహజం గానే ఎదో ఒక సందర్భంలో ఇంగ్లీష్ మాట్లాడేస్తూనే ఉంటాము. అలా మాట్లాడడానికి ఇక నుండి కుదరదని నాగార్జున స్పష్టం చేశారు. పాటించడం చాలా కష్టమే, మగవాళ్లు పాటించగలరేమో కానీ, ఆడవాళ్లు మాత్రం మాత్రం అసలు పాటించలేరు, కాబట్టి వచ్చే వారం కూడా నాగార్జున ప్రైజ్ మనీ ఇచ్చేటప్పడు కోతలు విధించి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!