Tuesday, December 6, 2022

నగ్నంగా మారిన నటి.. దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేస్తూ

సెలబ్రటీలు ఏం చేసిన సంచలనమే అని చెప్పాలి. సాధారణంగానే సెలబ్రటీలపై మీడియా ఫోకస్ కాస్తా ఎక్కువుగానే ఉంటుంది. ఇంకా ఏదైనా చేశారంటే.. దాని గురించి వేరేగా చెప్పాలా..?తాజాగా ఇదే జరిగింది. ఓ హీరోయిన్ తన మతానితో పాటు, మహిళలకు మద్దతుగా నిలుస్తు చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. హీరోయిన్ ఎల్నాజ్ నోరౌజీ ఇరాన్ లో మహిళలపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తన వంతు మద్దతు ప్రకటించారు. హిజబ్ ధరించాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ నటి ఎల్నాజ్ నరౌజీ నగ్నంగా నిరసన వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. నా దేహం.. నా ఇష్టం అంటూ హిజబ్ వ్యతిరేక నిరసనకు మద్దతు తెలిపింది. ఇన్స్‌టాగ్రామ్‌లో తన నిరసనను వ్యక్తం చేస్తూ.. తన దుస్తులను తొలగించి నగ్నంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇరాన్‌లో బలవంతంగా అమలు చేస్తున్న హిజబ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున మ‌హిళ‌లు ఈ యాంటీ హిజాబ్ ఉద్య‌మంలో పాల్గొంటున్నారు. వారిపై మోర‌ల్ పోలీసింగ్ సాగుతూ ఉంది. ఇది తీవ్ర హింసాత్మ‌కంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో దాదాపు వంద మంది వ‌ర‌కూ మ‌ర‌ణించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ కి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న నిరసన కార్యక్రమానికి నటి ఎల్నాజ్ నరౌజీ తన వంతుగా గళం వినిపించింది. మహిళలు తమకు కావలసినది ధరించే హక్కు ఉందని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన దుస్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తు…సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎవరైనా సరే.. ఏ దేశం వారైనా సరే.. వారికి ఇష్టం వచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉండాలి. తన మనసుకు నచ్చిన దుస్తులను ధైర్యంగా ధరించాలి. ఎలాంటి బెదిరింపులకు, ఆంక్షలు లోబడి జీవించ వద్దు అని సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

Latest News

error: Content is protected !!