Bigg Boss : బిగ్ బాస్ నాలుగో వారంలో వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది నామినేషన్లలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా తన టోన్ గురించి మాట్లాడిన సోనియా.. పృథ్వీకి ఇచ్చిపడేశాడు. సోనియాను నామినేట్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మాట్లాడి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఓటింగ్ లో నబీల్ క్రేజ్ మారిపోయింది. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న నబీల్ ఈ వారం అత్యధిక ఓటింగ్‌తో ముందుకు దూసుకుపోతున్నాడు. సోమవారం ఒక్కరోజే 35 శాతానికి పైగా ఓటింగ్ సాధించి విష్ణుప్రియ, నిఖిల్ రికార్డులను బద్దలు కొట్టారు. గత మూడు రోజులుగా నబీల్ అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే అన్ని టాస్క్‌ల్లోనూ నిఖిల్, పృథ్వీ లాంటి బలమైన కంటెస్టెంట్స్‌కు సవాల్ విసురుతున్నాడు. తన స్మార్ట్ గేమ్ ప్లే, ప్రశాంతమైన స్వభావంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. అతి తక్కువ సమయంలోనే నబీల్ హౌస్‌లో ఫేవరెట్ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. అంతే కాకుండా ఇన్ స్టాగ్రామ్ లో 25రోజుల్లోనే లక్షన్నరకు పైగా ఫాలోవర్లను పెంచుకుని రికార్డు నెలకొల్పాడు.
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కంటెంట్ ఎవరు అంటే మొన్నటి వరకు విష్ణు ప్రియ, నిఖిల్ ఈ ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ నామినేషన్స్‌లో ఉండగానే అత్యధిక ఓట్లు రావడంతో.. చాలా మంది స్ట్రాంగ్ అని ఫిక్స్ అయ్యారు. కానీ నబీల్ మాత్రం మెల్లగా విజేత రేసులోకి చాపకింద నీరులా ప్రవేశిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో రియల్ ఎవరంటే ఎలిమినేట్ అయిన వాళ్లంతా ముందుగా చెప్పేది నబీల్ పేరు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ ఎలాంటి మాస్క్ లేకుండా చాలా జెన్యూన్ గా ఆడుతున్నారని అన్నారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లే కాదు.. ఆట మొత్తం చూస్తున్న ప్రేక్షకులు కూడా.. తాజా ఓటింగ్‌లో నబీల్‌కు పట్టం కడుతున్నారు.
ప్రస్తుత సీజన్‌లో నబీల్ అఫ్రిది రోజురోజుకీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారిపోతున్నాడు. ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్స్‌లో టాప్ ఓటింగ్‌తో దూసుకుపోయాడు. సోనియాతో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో గొడవపడుతున్నారు. వరంగల్‌కి చెందిన నబీల్ అఫ్రిదికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా కోరిక. దీంతో తొలుత యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేశాడు. ప్రాంక్, కామెడీ వీడియోలతో మస్త్ పాపులరిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి యూట్యూబ్‌లో 16 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. బిగ్‌బాస్ హౌసులో ఉన్న నబీల్.. ఇప్పుడు తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. తనతో పాటు వీడియోల్లో నటించిన ఆద్య రెడ్డి అనే అమ్మాయితో లవ్ ట్రాక్ ను రివీల్ చేశాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఫొటోలు పోస్ట్ చేసి తన ప్రేమనంతా జనాల ముందు బయటపెట్టాడు.