Friday, October 4, 2024

Bigg Boss 8 : శేఖర్ భాష కోసం రంగంలోకి దిగిన స్టార్ హీరో.. కృతజ్ఞత తీర్చుకుంటున్నాడా ?

- Advertisement -


Bigg Boss 8 : బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. కాకపోతే ఈ షో రెండు వారాలు అయినా పూర్తి కాలేదు.. అప్పుడే కంటెస్టెంట్ల మధ్య ప్రేమలు, పగలు, కోపాలు, ద్వేషాలు ఇలా ఎన్నింటినో బిగ్ బాస్ ఆడియన్స్ కు చూపిస్తూ జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా హౌసులోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది… మరి వీరంతా ఒకే కుటుంబంలో ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. అందుకే కంటెస్టెంట్స్‌ని కొంతకాలం పాటు హౌస్‌లో ఉంచాలని సెలబ్రిటీలు సపోర్ట్ నిలుస్తూ… వారికి ఆడియన్స్ నుంచి మద్దతు లభించేలా చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో రాజ్ తరుణ్ ఒకరు.

ఇటీవల వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరు చెప్పి తనను వాడుకుని వదిలేశాడని.. ప్రస్తుతం మరో హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. ముఖ్యంగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని, అందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించింది. నిజానిజాలు తెలుసుకున్న పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చార్జ్ షీట్ లో చేర్చారు. అందులో రాజ్ తరుణ్, లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్, లావణ్య దాదాపు 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారని, లావణ్య చెప్పేదంతా నిజమేనని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. లావణ్య, రాజ్ తరుణ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. రాజ్ తరుణ్ కు మద్దతుగా ఆర్జే శేఖర్ బాషా ముందుకొచ్చారు. లావణ్యపై ఆరోపణలు చేయడమే కాకుండా ఆమెపై దాడి కూడా చేశారు. అలాంటి ఆయన తాజాగా బిగ్ బాస్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతడికి రాజ్ తరుణ్ అతనికి అండగా నిలిచాడు. తాజా చిత్రం భలే ఉన్నాడే ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రాజ్ తరుణ్‌ని ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా గురించి ఓ ప్రశ్న అడగగా.. శేఖర్ బాషా నిజం కోసమే నిలబడ్డాడు. సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు సహాయం చేశాడు. అందుకే వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తాను అని రాజ్ తరుణ్ చెప్పాడు.

అంతేకాదు శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని, అయినా ఆయన తనకోసం అండగా నిలబడ్డానని, ఒకానొక సమయంలో కొన్ని సినిమాల ప్రమోషన్స్‌లో మాత్రమే కలిశానని, అయితే అతడితో అంతగా స్నేహం లేదంటూ చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ తనకు మంచి చేశాడని, ఇప్పుడు శేఖర్ బాషా తనకు ప్రాణ స్నేహితుడయ్యాడని అన్నారు. కాకపోతే శేఖర్ బాషా హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ జోకులు, సెటైర్స్ వేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి తోడుగా రాజ్ తరుణ్ కూడా రాబోతున్నాడు. మరి రాజ్ తరుణ్ శేఖర్ బాషాకు సపోర్ట్ చేస్తే హౌసులో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!