Friday, October 4, 2024

Bigg Boss 8 : ఇంత కుట్రనా ఛీ.. మణికంఠను ఆ ముగ్గురు కనీసం మగాడిగా కూడా లెక్కేయడం లేదు

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారంలో సీత రెండో చీఫ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో శక్తి, కాంతారా సభ్యులను ప్రక్షాళన చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. ఏయే క్లాన్ లకు వెళతారని పోటీదారులను అడిగాడు. అందరూ సీత క్లాన్ లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపారు. సోనియా, పృథ్వీ మాత్రమే మనస్పూర్తిగా నిఖిల్ క్లాన్ లో చేరుతామని అన్నారు. మిగిలిన వారంతా కూడా సీత క్లాన్ లో చేరుతామన్నారు. అయితే సీత క్లాన్ నిండిపోవడంతో మణికంఠను నిఖిల్ క్లాన్ లో చేరాల్సిందిగా ఆదేశిస్తాడు. లేకపోతే సీత క్లాన్ లో ఎవరితోనైనా స్వైప్ చేసుకోవచ్చని సూచించారు. దీంతో మణికంఠ సీతను ఎవరినైనా స్వాప్ చేయాలని కోరుతాడు. అందుకు ఆమె తన క్లాన్ లోకి అంతా ఇష్టంగా వచ్చారని తను చేయలేనని చెబుతుంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో నిఖిల్ క్లాన్ లోకి వెళ్తాడు.

అలాగే ప్రేరణను కూడా నిఖిల్ క్లాన్ లోకే వెళ్లమని బిగ్ బాస్ సూచిస్తాడు. కానీ యష్మీ త్యాగం చేసి నిఖిల్ క్లాన్ లోకి వెళ్తుంది. అలా ప్రేరణ సీత క్లాన్ లో చేరుతుంది. దీంతో నిఖిల్, సోనియా, పృథ్వీ, యష్మీ, మణికంఠ శక్తి క్లాన్ సభ్యులు అవుతారు. సీత క్లాన్ పెరగడంతో లగ్జరీ రూం వారి సొంతం అవతుంది. అర్థరాత్రి సోనియా, నిఖిల్, పృథ్వీలు ముచ్చట్లు పెట్టుకుంటారు. మనం ముగ్గురం ఒక్కటి.. ఇంట్లో మిగతా సభ్యులంతా ఒక్కటి అని నిఖిల్ చెబుతాడు. సీత, నబిల్ తమ జట్టులో చేరడానికి ఎవరూ ఇష్టపడలేదని చెప్పుకుంటారు. నైనికా తాను సీతకు మద్దతు ఇచ్చానని నిఖిల్‌కి చెప్పింది. కానీ నిఖిల్ మాత్రం తన టీమ్‌లోని ఒకరిని చీఫ్‌గా చేయాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ ఇంటి సభ్యులపై బాంబు పేల్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ద్వారా పన్నెండు మంది ప్రవేశిస్తారని తెలిపారు. కానీ వాటిని ఆపడానికి, పన్నెండు టాస్కులు ఆడాలని సూచిస్తాడు. సవాళ్లు గెలిచిన ప్రతిసారీ ఒక వైల్డ్ కార్డ్ తగ్గుతుందని బిగ్ బాస్ చెప్పారు. అంతే కాకుండా గెలుపొందిన ప్రతిసారీ ప్రైజ్ మనీకి లక్ష రూపాయలు యాడ్ అవుతాయని చెప్పాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులంతావైల్డ్ కార్డ్‌లను ఆపడం గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మణికంఠను అబ్బాయిగా లెక్కించలేదు హౌస్ మేట్స్. మణికంఠ ఈ గ్యాంగ్ తో కాకుండా సపరేట్ గా కూర్చొని ఉంటాడు. ఇలా మణికంఠ మీద జోకులు వేయడం.. నిన్ను వీళ్లు అబ్బాయిగా కన్సిడర్ చేయడం లేదంటూ నిఖిల్ అనడంతో మణికంఠ బాగా హర్ట్ అవుతాడు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు.. దేనికైనా ఓ హద్దు ఉంటుందని మండిపడ్డారు.

మొదటి ఛాలెంజ్‌లో భాగంగా బంతిని పట్టుకుని టవర్‌లో పెట్టే పని అప్పగించారు. ఈ టాస్క్‌లో కాంతారా జట్టు విజయం సాధించింది. ఓడిపోయిన శక్తి క్లాన్ కు చెందిన వ్యక్తిని పక్కన పెట్టాలని బిగ్ బాస్ అన్నారు. యష్మీ, సోనియా, పృథ్వీ అందరూ మణికంఠను పక్కన పెట్టారు. ఇకపై మణికంఠ ఎలాంటి ఛాలెంజ్‌లో పాల్గొనకూడదని బిగ్ బాస్ తెలిపారు. అక్కడ మణికంఠ కూడా సాఫ్ట్ టార్గెట్ అయినట్ల తెలుస్తోంది. రెండో టాస్క్‌లో భాగంగా మహాతాలి ఇచ్చారు. భోజనం ఎవరు పూర్తి చేస్తారో వాళ్లే విన్నరంటూ టాస్క్ ఇచ్చారు. కానీ నబిల్, సోనియా ఆ తాళిని తినలేకపోయారు. ఆదిత్య, యష్మీ సపోర్టుగా వచ్చారు. అయినా పూర్తి చేయలేకపోయారు. రెండో ఛాలెంజ్‌లో రెండు క్లాన్ లు ఓడిపోయాయి. ఇప్పటి వరకు పదకొండు వైల్డ్‌కార్డులు ఫిక్స్‌ అయ్యాయి. మరి ఈ వారం ఇంకా ఎన్ని ఛాలెంజ్‌లు ఇస్తారు.. ఎన్ని గెలుస్తారు, ఎంతమంది వైల్డ్ కార్డ్‌లను బ్లాక్ చేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!