Saturday, April 20, 2024

ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాతే జగనే.. సామాన్యుల రియాక్షన్ ఇదే!

- Advertisement -

జగన్ పాలనపై సామాన్యుల రియాక్షన్ ఇదే..!

మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచి సాగేదే అసలైన రాజకీయం. ఈ ఏడాది అధికార వైసీపీ పార్టీకి చాలా కీలకమని చెప్పాలి. గడిచిన నాలుగేళ్లు కూడా అంతా కూడా జగన్ చెప్పినట్లుగానే సాగింది. ఈ నాలుగేళ్లలో జగన్ చాలా బలంగా ఎదిగారు. ఆయన్ను ఢీ కొట్టలంటే ప్రతిపక్షాలు వల్ల కావడం లేదు. అటు టీడీపీకి ఇటు జనసేనకు రెండు పార్టీలకు కూడా జగన్ చుక్కలు చూపించారు. రాజకీయంగా వారిపై అధిపత్యం నిత్యం చాలాయిస్తునే ఉన్నారు. ఇదే సమయంలో పరిపాలనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసింది లేదు. ఎన్నికల సమయంలో జగన్ ముందు ఇచ్చిన హామీలలో దాదాపుగా 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చారు.

ఇదే ఇప్పుడు జగన్‌ను ప్రజల్లో నాయకుడుగా నిలబెట్టింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో జగన్ తరువాతే ఎవరైనా అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జగన్‌పై కొంత సానుకులత కూడా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుతో పోల్చి చూస్తే ఈ విషయంలో జగన్ చాలా గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కొత్త హామీలను అయితే ప్రకటించబోరని కానీ ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు సైతం జగన్ పాలనతో సంతృప్తితో ఉన్నారు. మెజార్టీ మధ్య తరగతి ప్రజలు జగన్‌కు బలంగా మారారని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.

రాష్ట్రానికి జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకాన్ని వాయిదా వేసింది లేదు. పైగా ఏ రాష్ట్రంలోను అమలు చేయనన్ని పథకాలను అమలు చేసి చూపించారు సీఎం జగన్. జగన్ పై కొంతమందిలో వ్యతిరేకత ఉండటం వాస్తవమేనని అయితే ఎన్నికల సమయానికి ఆ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో తగ్గించే దిశగానే జగన్ అడుగులు ఉండనున్నాయని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలే ఆయన పొలిటికల్ కెరీర్ ను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!