తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి కూడా.. ఆయన నుంచి రాజకీయాలు మాత్రం దూరం కావడం లేదనే చెప్పాలి. చిరంజీవి 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారాయన. తరువాత నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన అనే పేరుతో మరో రాజకీయ పార్టీని పెట్టడం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టిన పవన్..ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా పవన్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు.అయితే పవన్ పార్టీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుది. ఇదే సమయంలో జగన్ వ్యూహాత్మకంగా చిరంజీవికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. ఆయనతో పలుమార్లు భేటీ అయ్యారు.
దీంతో చిరంజీవిని పవన్‌కు దగ్గర కాకుండా చేయడంలో జగన్ విజయం సాధించారనే చెప్పాలి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో చిరంజీవి మద్దతు పవన్ కల్యాణ్ పార్టీ అయిన జనసేనకు ఉంటుందని అందరు భావించారు. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది.. మీ మెగా అభిమానులను ఎవరికి సపోర్టుగా నిలవమని చెబుతారని చిరంజీవిని ప్రశ్నించారు. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ…
నేను ఎక్కడ కూడా ఎవరికి సారథ్యం వహించడం లేదు. ఇక తమ సైన్యానికి కూడా ఎలాంటి దిశా నిర్దేశం ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయను. నా సినిమాలు చూడండి అని చెబుతాను. అంతేకాకుండా నన్ను బిజీగా ఉంచండి అని కూడా చెబుతాను. తప్పితే పొలిటికల్ గా ప్రస్తావించే ప్రయత్నం చేయను.. అని మెగాస్టార్ కుండబద్దలు కొట్టేశారు. ఒకవైపు వైఎస్ జగన్ తో పాటు మరొకవైపు మీ సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోరాహోరీగా పోటీ పడబోతున్నారు. ఈ సమయంలో మీ చూపు ఎక్కడవైపు ఉంటుంది అని అడిగినప్పుడు మెగాస్టార్ కూడా చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను కూడా ఈ సమయంలో ప్రేక్షకుడిగా చూడమే తప్ప ఏమి చేయడం లేదు.
నిజానికి తన సోదరుడు పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీకి నేరుగా వచ్చి ప్రచారం చేయకపోయినా ఒక ప్రకటన ద్వారా మద్దతిస్తారని మెగా అభిమానులు భావించారు. కానీ చిరంజీవి ఆ పని కూడా చేయరని అర్థమయింది. ఆయన ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుంది. చిరంజీవి తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా ఆచితూచి చేస్తారు. ఎవరినీ నొప్పించరు. తనపై విమర్శలు చేసిన వారిని కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం ఏపీ రాజకీయాల్లో వేలుపెడతారనుకోవడం భ్రమే అవుతుంది. పవన్ అందలమెక్కితే సంతోషిస్తారు. రాజకీయంగా నష్టపోతే బాధపడతారు. ఏది ఏమైనప్పటికి కూడా చిరంజీవి ముందర కాళ్లకు బంధం వేసిన వైసీపీ అధినేతకు రాజకీయ విశ్లేషకులు సైతం హ్యాట్సాఫ్ చెబుతున్నారు.