Tuesday, September 10, 2024

అమెరికాలో బాలకృష్ణకు ఘోర అవమానం ..సినిమాను ఆపేసి ప్రేక్షకులను బయటకు గేంటేసిన పోలీసులు

- Advertisement -

ఘోర అవమానం..బాలకృష్ణను సినిమాను ఆపేసి ప్రేక్షకులను బయటకు గేంటేసిన పోలీసులు ఎక్కడో తెలుసా..?

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ పరిస్థితి. పేరుకు టాప్ హీరో అయినప్పటికి కూడా ఆయన అభిమానులు చేసిన పనికి ఇప్పుడు ఏకంగా దేశం పరువు పోయింది. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహరెడ్డి. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను ఆపేసి.. అక్కడ ఉన్న ప్రేక్షకుల మొత్తన్ని బయటకు పంపేశారు విదేశి పోలీసులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు. కాని బాలకృష్ణ అభిమానులు మాత్రం దేశం మొత్తం పరువు పోయేలా చేసి..దేశానికి తలవంపులు తెచ్చారు. బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహరెడ్డి అమెరికాలో బుధవారమే విడుదలైంది. అమెరికాలో బాలయ్య అభిమానులు కాస్తా అతిగానే హంగామా చేశారు. టీడీపీ జెండాలు పట్టుకుని థియేటర్లో జై బాలయ్య అంటూ నానా గోల చేయడం, ఇష్టం వచ్చినట్లు కాగితాలు చింపి ఎగరేస్తూ నానాయాగి చేశారు.

దీంతో థియోటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు థియోటర్లో జరుగుతున్న తతంగం అంతా చూసి.. వెంటనే షోను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా బాలయ్య అభిమానులకు ఫుల్‌గా క్లాస్ కూడా పీకారు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు ప్రదర్శించినా ఇలాంటి పరిస్థితి లేదని, ఇది తొలిసారని క్లారిటీగా క్లాస్ పీకారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హద్దు మీరి ప్రవర్తించి విదేశంలో మన పరువు తీస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అభిమానం వెర్రి ఇలానే ఉంటుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా అమెరికాలో మన తెలుగోళ్ల పరువు పోవడం కాస్తా బాధకరమే అని చెప్పాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!