Wednesday, October 16, 2024

జగన్‌ కేసులో మరో ట్విస్ట్ .. క్లీన్‌చీట్ ఇస్తూ ఉత్తర్వులు

- Advertisement -

జగన్‌ కేసులో మరో క్లీన్‌చీట్.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్‌కు సంబంధించిన కేసులన్ని కూడా ఒకొక్కటికి తొలగిపోతున్నాయి. ఇప్పటికే జగన్ మీద నమోదు అయిన కేసులు ఒక్కొక్కటికి కొట్టివేస్తు హైకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. జగన్ లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపించిన ప్రతిపక్షాలు.. వాటిని నిరుపించడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారనేది జగన్ మీద ప్రధాన ఆరోపణ. అయితే సీబీఐ పెట్టిన కేసుల్లో నిజాలు లేకపోవడంతో.. జగన్ నిర్థోషిగా ప్రకటిస్తు.. కోర్టు తీర్పును వెల్లడిస్తుంది. తాజాగా ఉమ్మడి ఏపీకి సంబంధించిన కేసును కొట్టివేస్తు తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సీనియర్ మహిళ iAS ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మీ మీద ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెపై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఈ కేసుకు జగన్‌కు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికి కూడా శ్రీలక్ష్మీ అరెస్ట్ అయింది.. జగన్ వల్లే ఆమె జైలుకు వెళ్లిందనే అప్పట్లో విమర్శలు వినిపించాయి. వైఎస్ ఫ్యామిలీ వల్ల iAS ఆఫీసర్లు జైలు చూట్టు తిరుగుతున్నారని.. ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో iAS ఆఫీసర్ శ్రీలక్ష్మీని నిందితురాలుగా సీబీఐ చేర్చింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.80 లక్షలు తీసుకుని అనుమతులు ఇచ్చారని ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఆరోపణలు వినిపించాయి. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఆమె కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఆమెకు..అవినీతి కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించలేకపోవడంతోనే.. ఆ కేసు నుంచి శ్రీలక్ష్మీ మినయింపు ఇచ్చినట్లగా సమాచారం అందుతుంది. శ్రీలక్ష్మీ కూడా నిర్థోషిగా బయటకు రావడంతో..అప్పుడు పెట్టిన కేసులు అన్ని కూడా రాజకీయ కక్ష్యతో పెట్టినవే అని మరోసారి నిరుపితం అయినట్లు అయింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!