Wednesday, April 24, 2024

ఆ వైసీపీ నేతపై పవన్ కల్యాణ్ ప్రసంశలు

- Advertisement -

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి వరకు అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అనే విధాంగా పోరాడాయి. కాని సడన్‌గా రేసులోకి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ దూసుకువచ్చింది. అప్పటి వరకు చోట మోట ధర్నాలు చేసిన జనసేన ఒక్కసారిగా లైఫ్ ‌లైన్‌లోకి రావడంతో.. అధికార పక్షం కూడా షాక్‌కు గురైంది. టీడీపీ చేయలేని సాహసాలను కూడా జనసేన పార్టీ చేసి చూపించింది. ఏకంగా మంత్రుల కార్ల మీదనే రాళ్లు విసిరారంటే.. జనసేన కార్యకర్తలు ఎంతటి దూకుడుగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. తరువాత జరిగిన పరిణమాలన్ని కూడా అందరికి తెలిసిందే. మంత్రుల కార్ల మీదనే రాళ్లు విసిరిన జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం .. దీనిపై పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద విరుచుపడటం .. ఆ తరువాత పవన్‌తో చంద్రబాబు భేటీ కావడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి.

వైసీపీ నాయకుల మీద పవన్ విరుచుకుపడ్డారు. వారిని నా కొడకల్లారా అంటూ సంభోదిస్తూ వారిని చెప్పుతో కూడా కొడుతానని హెచ్చరించారు. వైసీపీ నాయకులను బండబూతులు తిట్టిన పవన్.. ఇద్దరి నేతలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. వైసీపీ నాయకుల మీద విరుచుకుపడిన పవన్ ..ఇప్పుడు ఓ వైసీపీ నేత గురించి పాజిటివ్‌గా మాట్లాడటం సంచలనంగా మారింది. ఆ నేత మరెవ్వరో కాదు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అవును పవన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ప్రసంశలు కురిపించారు. తాను వైసీపీ నాయకులందరిని అనడం లేదని ..అందులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు కూడా ఉన్నారని పవన్ తెలపడం.. ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి , పవన్ కల్యాణ్‌లకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆ మధ్య ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేస్తే.. బాలినేని శ్రీనివాసరెడ్డే దగ్గరుండి జనసేన కార్యకర్తలను విడుదల చేయించారు. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనరు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఎందుకు తెర మీదకు తీసుకువచ్చారో ఎవరికి అర్థం కావడం లేదు. జిల్లాలో వరుస వివాదాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి సావాసం చేస్తున్నారు. మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పైగా జగన్ దగ్గర బంధువు కావడంతో.. ఎక్కువుగా ఫోకస్ అవుతున్నారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి పవన్ కల్యాణ్ బహిరంగంగా మాట్లాడటం సంచలనంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డిపై పవన్ మాటలు రాజకీయంగా ఎటువైపు దారి తీస్తోందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!