Thursday, October 3, 2024

Bigg Boss 8 : మూడో వారంలో దిమ్మతిరిగే ఓటింగ్.. ఆ స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్‎కి షాక్

- Advertisement -


Bigg Boss 8 : భారతదేశంలోని పలు భాషల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రతిచోటా విశేష స్పందనను అందుకుంటూ నంబర్ వన్ షోగా అలరిస్తోంది. అయితే వీటన్నింటికీ మించి తెలుగులో నడుస్తున్న షోకే ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అందుకే మనకి మాత్రమే ఊహించని రేటింగ్ వస్తోంది. ఈ షో ఇప్పటికే ఏడు సీజన్‌లను పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో మూడో వారంలో ఏ కంటెస్టెంట్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారో వివ‌రాలు చూద్దాం.. అన్ని భాషల కంటే తెలుగులో వచ్చే బిగ్ బాస్ షో పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. అందుకే నిర్వాహకులు సరి కొత్త కాన్సెప్టులతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఎనిమిదో దాన్ని నడుతుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూపించని కొత్త కంటెంట్ చూపిస్తున్నారు. అలాగే ట్విస్టులు, షాక్ లు , టాస్క్ లు , సర్ ప్రైజ్ లు వైవిధ్యంగా ప్లా్న్ చేస్తున్నారు.

ఎనిమిదో సీజన్‌లో విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ కంటెస్టెంట్లుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ కాగా, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో అందరి దృష్టి నామినేషన్స్ టాస్క్ పైనే ఉంది. దాని ప్రకారం ఎనిమిదో సీజన్ లో కూడా ఈ టాస్క్ నడుస్తోంది. ముఖ్యంగా మూడో వారం హై రేంజ్ లో జరిగింది. అభయ్ (సెల్ఫ్ నామినేట్), విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ మరియు నైనిక ఈ వారం నామినేట్ అయ్యారు.

గత సీజన్‌లతో పోలిస్తే లేటెస్ట్ సీజన్లో భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు తక్కువ మందే ఉన్నారు. అందులో విష్ణుప్రియ ఒకరు. అందుకే ఈ అమ్మడు తాజా ఓటింగులో టాప్ ప్లేస్ లో నిలచింది, ఆమె తర్వాత మాత్రం అనామక కంటెస్టెంట్ మణికంఠ ఉన్నారు. వీళ్లిద్దరూ మూడో వారంలో టాప్ 2గా నిలిచి సేవ్ అయిపోయారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరిగిన ఓటింగ్ లో విష్ణుప్రియ భీమనేని, మణికంఠ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. దీని తరువాత, కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు వచ్చాయి. తాజా అప్‌డేట్ ప్రకారం.. నైనికా మూడో స్థానంలో, ప్రేరణ నాలుగో స్థానంలో, పృథ్వీరాజ్ ఐదో స్థానంలో ఉన్నారు. వీరంతా ఈ వారం కూడా దాదాపు సేఫ్ కానున్నారు. ఎనిమిదో సీజన్ ఓటింగ్ మూడో వారంలో కిర్రాక్ సీత ఆరో స్థానంలో నిలిచింది. అలాగే యష్మీ గౌడ ఏడో స్థానంలో, అభయ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. అంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇందులో అభయ్ ఈ వారం ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఎందుకంటే మిగతా ఇద్దరు షోకి కంటెంట్‌ని తీసుకువస్తారు. వాటిని పంపడానికి ధైర్యం చేయరు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!