Sunday, September 8, 2024

AP CM chandrababu:చంద్రబాబు ప్రభుత్వానికి సీబీఐ ఝలక్

- Advertisement -

AP CM chandrababu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ ఝలక్ ఇచ్చింది. ఐఎంజీ అకాడమీస్‌ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో అక్రమంగా భూములు కేటాయించిన కేసులో దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ తెలిపింది. కోర్టు ఆదేశిస్తే 2003లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతామని చెప్పింది. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ కేసు సీఎం చంద్రబాబు మెడకు ఉచ్చులా బిగుసుకునేలా కనిపిస్తోంది. కాగా, మరోవైపు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో భాగస్వామం ఏర్పరచుకోవడం వల్ల కేసు బయటికి రాకుండా అందరి కళ్లుగప్పె ప్రయత్నాలు కూడా జరగవచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ఐఎంజీ కంపెనీ ఏర్పడిన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు ఈ కేసు ఏంటంటే.. అప్పట్లో క్రీడల అభివృద్ధి కోసం ఐఎంజీ భారత్ కోసం 2003లో మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో 850 ఎకరాల అత్యంత విలువైన భూమి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని మిగతా స్టేడియంలను కూడా ఐఎంజీ సంస్థకే అప్పగించింది. ఇదిలా ఉండగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అత్యంత విలువైన భూములను ఐఎంజీ సంస్థకు అతి కొద్ది రోజుల్లోనే అప్పగించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భావించి అందుకు సంబంధించిన జీవోని రద్దు చేసింది. దీంతో వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తూ.. తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే క్రమంలో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పలు పిటిషన్లు దాఖలు కాగా, కోర్టు అనుమతిస్తే విచారణకు సిద్ధమని సీబీఐ స్పష్టం చేసింది.

తద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఇది ఒక మచ్చలా మిగిలిపోనుంది. ఐఎంజీ సంస్థ 2003లో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన సంస్థ అని తెలియవచ్చింది. ఆ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు అప్పజెప్పి టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడే చర్యకు దిగిందని అర్థమవుతూనే ఉంది. అయితే ఇప్పుడు సీబీఐ ప్రకటన తర్వాత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!