Thursday, October 3, 2024

Jainoor Tensions : జైనూరు రగిలిపోతోంది.. జాతీయ స్థాయిలో తెలంగాణ హాట్ టాపిక్

- Advertisement -

Jainoor Tensions : ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి.. హత్య చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర సంచలనంగా మారింది. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూరులో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్.. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అరుపులు, కేకలు వేసిన మహిళ.. ఆటో నుంచి దూకేసింది. అనంతరం ఆమెపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ స్పృహ తప్పిపోయింది. ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్ అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేసిన వ్యక్తి గురించి చెప్పడంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది.

తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది.మరోసారి విధ్వంసపూరిత ఘటలనకు అవకాశం కలుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కర్ఫ్యూతోపాటు 144 సెక్షన్ అమలు చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఆదివాసీ మహిళపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడడమే అందుకు కారణం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి ఉద్రిక్తతకు కారణమేంటి? జైనూర్‌లో అసలేం జరిగింది? డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.. జైనూరు మండలం దేవుగూడకు చెందిన 45 ఏళ్ల ఆదివాసీ మహిళపై ఓ ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.. తీవ్రంగా గాయపరిచాడు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలియగానే ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు పొలిటికల్ పార్టీలు ఎంట్రీ అయ్యాయి. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని పార్టీలు టార్గెట్ చేసుకోవడం విశేషం. ఈ ఘటన ఆగస్టు 31న జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆదివాసీలు ప్రభావిత జిల్లా కావడంతో ఒక్కసారిగా ఉద్యమం ఎగసిపడింది. ముఖ్యంగా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఆగ్రహానికి గురైన ఆదివాసీలు నిందితుడి ఇంటికి ధ్వంసం చేశారు. దీంతో జైనూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెచ్చిపోయిన ఆందోళనకారులు మార్కెట్‌లో తోపుడు బళ్లకు నిప్పుపెట్టారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. ఆ మంటలు కాస్త రోడ్డుపక్కనున్న షాపులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతోపాటు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలకు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.పరిస్థితి గమనించిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. బయటి వ్యక్తులు జైనూరుకు వెళ్లడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ తేల్చిచెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు.

మరోవైపు ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.,ఘటనకు కారకుడైన నిందితుడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని జిల్లా ఎస్పీ ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఏమాత్రం నమ్మవద్దని కోరారు. జైనూర్ టౌన్ చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!