Friday, October 4, 2024

Chandrababu: మొదటికే మోసం తెచ్చిన చంద్రబాబు ఐడియా : కూటమి గుండెల్లో దడ : కేంద్రం సంచలన నిర్ణయంతో వణుకు

- Advertisement -

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరియు ఎన్నికల వాతావరణం ముగిసి నాలుగు నెలలు అయింది. అధికారంలో మార్పు అయితే వచ్చింది కానీ ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదని అంటున్నారు. గతానికి భిన్నంగా ప్రజలకి సంక్షేమ పథకాలు నేటి ప్రభుత్వం అందిస్తుందా అంటే అది కూడా లేదు. అధికారంలోకి రాకముందేమో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ప్రజలకి అనేక హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చాక తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని పక్కన పెడితే ఇంత ముందు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలని కూడా ప్రజలకి అందించటం లేదు ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలకి సంక్షేమ పథకాలని అందించలేమని ఇచ్చిన హామీలని నెరవేర్చలేమని చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం పేల్చిన బాంబుతో కుంభస్థలం బద్దలైన పరిస్థితి నెలకొంది.

ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమిలీ ఎన్నికల గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ దీనికి తగ్గట్టుగా గ్రీన్ సిగ్నల్ రాలేదు చాలా రోజుల నుంచి. కానీ ఇప్పుడు రామనాథ్ కోవింద్ కమిటీ సిఫారసులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. దీంతో ఏ క్షణంలో అయినా జమిలీ ఎన్నికకు రంగం సిద్ధం కావచ్చు. ఒకవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు బలం లేదు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ కూటమిగా జత కట్టడమే. జమిలీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో కూటమిగా అవతరించిన చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కి పెద్ద అగ్ని పరీక్ష ఎదురు కానుంది అని చెప్పవచ్చు. అయిదేళ్ళకి వచ్చే ఎన్నికలు కాస్త జమిలీ ఎన్నికలు అయితే మాత్రం ముందస్తు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

జమిలీ ఎన్నికలు మోడీ 3.౦ లోనే ఉంటాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వస్తున్న మోడీ సర్కార్ ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేదే కేంద్ర౦ ఉద్దేశం. జమిలీ ఎన్నికలు జరిగితే వచ్చే లాభాలు అనేకం అని వారు భావిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ 1961 వరకు జమిలీ ఎన్నికలే జరిగాయి దేశమంతటా. ప్రస్తుతం జమిలీ ఎన్నికల కోసం కేంద్ర౦ చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల ఎన్నికలు ఆలస్యం చేయడం మరొక పక్క కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకి జరపడం ఇలా. మధ్యంతర ఎన్నికలు రానున్న నేపధ్యంలో సమయం ఎక్కువ లేకపోవడ౦ వల్ల ఎన్నికలకు సిద్ధమవడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారట. ప్రజల్లో ఇప్పటికే తమ పట్ల వ్యతిరేకత వచ్చిందని దాన్ని జగన్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన బాధ పడుతున్నారట. మరొక పక్క పవన్ కళ్యాణ్ కి భారీగా క్రేజ్ పెరిగిపోయిందని ఆయనతో కలిసి ఉండటం ఇక తనకే నష్టమని కూటమిగా ఏర్పడటం వాళ్ళ మొదటికే మోసం వచ్చిందని ఆయన అనుకు౦టున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!