వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ తెలివితేటలకు రాజకీయ పండితులు సైతం ఫిదా అవుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న మాదిరిగా జగన్ కనిపిస్తుండటంతో.. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ప్రణళికలు రచిస్తున్నారాయన. దీనిలో భాగంగానే టీడీపీ, జనసేనలకు కొలుకోలేని దెబ్బ కొట్టారాయన. విశాఖలో జరిగిన ఎపిసోడ్ మొత్తంలో జనసేన హైలేట్ అయినప్పటికి కూడా .. దీని వెనుక జగన్ మాస్టర్ స్కెచ్ ఉందని తాజాగా అందరికి అర్థం అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏపీ రాజకీయ మొత్తం కూడా ఇప్పుడు జనసేన ,టీడీపీల చూట్టునే తిరుగుతుంది.
మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వంలో విశాఖలో గర్జన పేరటి భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టీ జనవాణి పేరిట సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ఒకేరోజు రెండు పార్టీలు బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో..విశాఖలో యుద్ద వాతవరణం కనిపించింది. జనసేన కార్యకర్తలు.. వైజాగ్ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడికి దిగారు. జనసేన వారు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు.
దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు సీసీ ఫుటేజ్ ల ఆధారాలతో విచారణ జరిపి పలువురు జనసేన నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై పవన్ కల్యాణ్ కూడా ఘాటుగానే స్పందించారు. పవన్‌కు వైసీపీ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో పవన్ తన ఆవేశాన్ని ఆపుకోలేక… వైసీపీ నాయకులను ,చెప్పుతో కొడతానని చెప్పడం… వెంటనే టీడీపీ అధినేత పవన్‌ను కలవడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. అయితే టీడీపీ జనసేన కలిస్తే.. వైసీపీ అధికారానికి దూరం అవుతుందని చాలామంది భావిస్తున్నారు.
అసలు టీడీపీ , జనసేన కలవడం వెనుక జగన్ మాస్టర్ మైండ్ ఉందని తెలుస్తోంది. పవన్ ఆవేశాన్ని పసిగట్టిన జగన్… దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. అందరు అనుకున్నట్లుగానే పవన్ చాలా ఈజీగా జగన్ ట్రాప్‌లో పడ్డారు. పదే పదే మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను పవన్ తట్టుకోలేకపోయారు. వెంటనే వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి .. రాజకీయాల్లో తన అవివేకతను మరోసారి బయటపెట్టుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ ఇద్దరు ఒకటే అని తాము చెబుతున్నది నిజమే అన్నట్లుగా పవన్‌ను కలిశారు చంద్రబాబు. దీంతో వీరి అసలు రంగు బయటపడినట్లు అయింది. ఇదిలా ఉంటే పవన్‌ను బీజేపీకి దూరం చేయడంలో కూడా జగన్ విజయవంతం అయ్యారు.
చంద్రబాబు, పవన్ ఎంత తొందరగా కలిస్తే అంత మంచిదనట్లుగా జగన్ భావించారు. ఎన్నికల ముందు వీరి నాటకం బయటపడితే కష్టమని.. ముందుగానే వీరి ముసుగు తొలగించడం ద్వారా లెక్కలు పక్కాగా ఉంటాయని జగన్ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ ఒక్కటవ్వడం ద్వారా వీరిద్దరిని ఎలా ఎదుర్కొవాలో ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చని జగన్ ప్రణళికగా తెలుస్తోంది. అటు చంద్రబాబు కాని.. ఇటు పవన్ కాని చాలా ఈజీగానే జగన్ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. మరి జగన్ ముందు ముందు వీరు జగన్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.