Thursday, October 3, 2024

అసలు వైసీపీలో వీరు ఉన్నట్టా లేనట్టా..?

- Advertisement -

అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. పార్టీ అధినేత , ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. రాబోవు ఎన్నికల్లో ఆయన 175 సీట్లకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారాయన. దీనికి అనుగుణంగానే ఆయన వ్యూహాలు కూడా ఉన్నాయి.అయితే పార్టీలో ఎక్కడో తెలియని లోటు కనిపిస్తుంది. అందరు కూడా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. వారిపై వ్యతిరేకత ఉందా.. గడప గడపకు ప్రభుత్వంలో వారికి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై ఆరా తీస్తున్నారు కాని.. పార్టీలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారనే సంగతి చాలామంది మర్చిపోయారు. అసలు వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీలు ఉన్నారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడింది లేదు. ఎమ్మెల్సీలు పార్టీకి బలం కావాలి కాని..ఎమ్మెల్సీలకే పార్టీ బలం అవుతుంది. దీనిపై పార్టీ అధినేత కూడా దృష్టిపెట్టకపోవడం శోచనీయం.

వీరందరికి కూడా పదవులు అలంకారప్రాయమే అని తెలుస్తోంది. వీరు ఎవరు కూడా మీడియా ముందుకు పార్టీ తరుఫున తమ వాయిస్ వినిపించింది లేదు. పార్టీ మీద కాని.. జగన్ మీద కాని విమర్శలు వచ్చిన సమయంలో కూడా పార్టీ ఎమ్మెల్సీలు ఇల్లు వీడిచి బయటికి రాకపోవడంపై బాధకరం. ఇలాంటి నేతలకా పదవులు ఇచ్చింది అని అటు కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పదవుల విషయంలో ఎటువంటి సిఫార్సులకు లొంగలేదు. తాను అనుకున్న వారికే పదవులను కట్టబెట్టారు. కొన్ని చోట్ల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికి కూడా వీరు జగన్‌కు అండగా నిలబడింది లేదు. పొరపాటున వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే.. కనుక వీరు తమ వ్యాపారాల్లో మునిగిపోతారే తప్ప..ఒక్కరు కూడా పార్టీ గురించి పట్టించుకునే పరిస్థితి లేదనిపిస్తుంది. దీనికి తోడు చాలామంది ఎమ్మెల్సీలు గ్రూపు తగదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.

ఇచ్చిన పదవితో సంతృప్తి చెందకుండా..వచ్చే ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల్లో ఉండి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. చాలామంది ఎమ్మెల్సీలు శాసనసభకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇచ్చిన పదవితో సరిపెట్టుకోకుండా ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతుండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గ్రూపులను మెయిన్ టెయిన్ చేస్తూ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నారు.ఇలా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు మధ్య బహిరంగ యుద్ధమే నడుస్తుంది. వీరు తీరు చూస్తుంటే..వచ్చే ఎన్నికల్లో పార్టీని ముంచిన ఆశ్చర్యపడాల్సిన పని లేదనిపిస్తుంది. దీనిపై జగన్ వెంటనే దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోకపోతే.. వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. మరి వీరిలో ఎవరిని సస్పెండ్ చేస్తారు? ఎవరిని పార్టీలో ఉంచుతారు? అన్నది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!