రాజకీయాల్లో సాధ్య , అసాధ్యాయాలు అంటూ ఏమి ఉండవని చాలానే ఘటనలు రుజువు చేశాయి. అలా అనుకుంటే ఉమ్మడి ఏపీ విడిపోయి..తెలంగాణ వచ్చేదా.. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యేవారా..? పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయేవారా…? ఇలా చెప్పుకుంటుపోతే చాలానే ఉన్నాయి. అసలు మ్యాటర్‌లోకి వస్తే..సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌గా మారాలని చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన ఓ క్లారిటీ కూడా ఇచ్చారు.2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన .. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే.. ఆయన ఎంత ప్రయత్నించిన్పప్పటికి కూడా ఓటమిని మాత్రం జయించలేకపోయారు. జనసేన అధినేత.. 2019 తర్వాత.. ఓటమిని అంగీకరించి.. మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై జేడీ తీవ్రంగానే స్పందించారు. సినిమాలు చేయనని.. రాజకీయాల్లోనే ఉంటానని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాల్లోకి ఎలా వెళ్తారంటూ.. ప్రశ్నించి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక, అప్పటి నుంచి ఒంటరిగానే ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు.
ఇటీవలే ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారాయన. అయితే ఆయన తిరిగి జనసేన పార్టీలో చేరుతున్నారని , ఏపీలో ఆప్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారని ఇలా ఆయనపై రాజకీయ ప్రవేశంపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వీటిన్నంటికి చెక్ పెడుతూ ఆయన వచ్చే ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయడం లేదని.. స్వతంత్ర్య అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బరిలోకి దిగుతున్నానని ఆయన తెలపడం జరిగింది. ఆయన గతంలో అంటే 2019 ఎన్నికల్లో విశాఖ నుంచే జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అది కూడా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక ఏదో అంతర్యం ఉందనిపిస్తుంది.
ఆయన పనికట్టుకుని విశాఖలోనే పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక వైసీపీ అధినేత మాస్టర్ మైండ్ ఉందనిపిస్తుంది. సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ వైసీపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయన 2019 ఎన్నికల తరువాత వైసీపీ చేరాలని ప్రయత్నించారు. కాని ఇది కార్యరూపం దాల్చలేదు. తరువాత ఆయన వైసీపీ పాలనకు మద్దతుగా కూడా మాట్లాడటం జరిగింది. మూడు రాజధానులకు దాదాపు అనుకూలంగా ఒక కామెంట్ కూడా చేశారు. విశాఖకు పరిశ్రమలతోనే అభివృద్ది కాదు.. పాలన కూడా చేరువ కావాలి.. అని వ్యాఖ్యానించారు.
దీంతో పాటు ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఇవ్వన్ని నిశితంగా పరిశీలించిన తరువాత ఆయన వైసీపీతో టై అప్ అయ్యారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నేరుగా వైసీపీలో చేరితే విమర్శలు వస్తాయనే..విశాఖలో లక్ష్మీనారాయణను స్వతంత్ర్య అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నారట. విశాఖలో లక్ష్మీనారాయణ ఆర్థికంగా రాజీకయంగా అధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దీని వెనుక జగన్ మాస్టర్ మైండ్ ఉందని తెలుస్తోంది. మరి విశాఖలో లక్ష్మీనారాయణ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.