Revanth Reddy: పెద్దలనే కాదు సామాన్యులను సైతం చుక్కలు చూపిస్తోంది హైడ్రా.కళ్లెదుటే కూల్చి వేతలతో రెచ్చిపోతోంది. ముఖ్యంగా
వారాంతం రోజుల్లోనే హైడ్రా రెచ్చిపోతోంది. పని రోజుల్లో ప్రశాంతంగా ఉంటూ ఒక్క ఆదివారం రోజే హైడ్రా బుల్డోజర్లపతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ ఆదివారం కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో హైడ్రా దాడులు చేపట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. అయితే అకస్మాత్తుగా బుల్డోజర్లతో రావడంతో నివాసితులు లబోదిబోమన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో కన్నీళ్లు.. రోదనలతో ఆ ప్రాంతం ఉద్విగ్న వాతావరణంతో నిండిపోయింది.హైడ్రా ప్రతాపం మరింత పెరుగుతుండడంతో బుల్‌డోజర్లు ఎక్కడ దిగి విధ్వంసం స్రష్టిస్తాయోనన్న ఆందోళన సామాన్య జనాల్లో ఉంది.
భాగ్యనగరమే కాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా పెద్ద ప్రతాపమే చూపుతోంది. ముఖ్యంగా అభివ్రద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విశ్వరూపం చూపుతోంది. చాలారకాలుగా ప్రభావంచూపుతోంది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది.నిర్మాణరంగంనీరసిస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయ సైతం తగ్గుముఖం పడుతోంది. ఈ వీకెండ్ లో ఏకకాలంలో బుల్‌డోజర్లకు పని చెప్పింది హైడ్రా.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 12లో ఆదివారం ఉదయమే హైడ్రా రంగంలోకి దిగింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పటేల్‌గూడ గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 6 పేరుతో.. కిష్టారెడ్డిపేట గ్రామం ప్రభుత్వ సర్వే నంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేసింది.హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూడా ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎటువంటి నోటీసు లేకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా కూల్చివేతలు కొనసాగించింది.
పేదల ఇళ్లు అని చూడడం లేదు. కట్టుబట్టలతో మిగులుతారని కనికరించడం లేదు. అక్రమనిర్మాణమని తెలిసిన మరుక్షణం యంత్రాలకు పని చెబుతున్నారు అయితే ఈ క్రమంలో పేదలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. నల్లచెరువులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కోల్పోయిన వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని కూడా కూల్చివేయడంతో వారు మండిపడుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి వ్యాపారం చేస్తుంటే హైడ్రా పేరిట అధికారులు కూల్చివేతలు చేయడం సరికాదని వాపోయారు. తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరిని ఆశ్రయించాలో.. ఎవరికి బతిమిలాడాలో తెలియడం లేదు. నేతల జాడలేదు. వారికి చెబుతున్నా వినకపోవడంతో వ్యథ అంతా ఇంతా కాదు.ఇల్లు కోల్పోయిన మహిళలు, బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ గూడు కూల్చేయడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కూల్చివేతలకు వచ్చిన హైడ్రా అధికారులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కాళ్లు పట్టుకుని కూల్చవద్దని కోరుతుండడం అందరినీ కలచివేస్తోంది. సామాన్యులు.. పేదలపైనే హైడ్రా ప్రతాపం అని.. రేవంత్ రెడ్డి తమ్ముడు.. మురళీమోహన్ వంటి వారికి మాత్రం నోటీసులు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా హైడ్రా తెలివిగా ఆదివారం రోజునే కూల్చివేతలు చేపడుతుండడంతో కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోతున్నది. దీంతో స్థానికులు హైడ్రాపై.. రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.