Tuesday, October 8, 2024

AP GOVERNMENT: దాదాపు నెల అవుతున్నా.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి!

- Advertisement -

AP GOVERNMENT: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడ లాంటి ప్రముఖ నగరం వరదలతో మునిగిపోయి అప్పుడే దాదాపు నెల రోజులు కూడా కావస్తోంది. పలు శివారు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన సంగతి తెలిసిందే. ఇంత భారీ విపత్తు సంభవించి ఇంత నష్టం చేకూరినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి చర్యలు జరగలేదు. ఘటన జరిగి 20 రోజులు దాటినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. అసలు ఈ విషయం తమకు పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం గ‌మ‌నార్హం. కేంద్రం ఆదుకుంటుందనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయకుండా మౌనం వహించింది.

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా భారీ విపత్తులు సంభవిస్తే కేంద్రం నుంచి నిధులు రావడం మామూలే. వరద విపత్తు కారణంగా రాష్ట్రం నష్టాల్లోకి చేరిందని, సుమారు 680 కోట్ల రూపాయలు నష్టపోయామని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్తించింది. పైగా టీడీపీతో కూటమిగా ఏర్పడిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇదంతా చూస్తుంటే.. కూటమిగా ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏపీ టీడీపీపై నిర్లక్ష్యం వహించిందా? ప్రధాని మోదీ దృష్టిలో అసలు చంద్రబాబుకు విలువ ఉందా? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందని ప్రజలు టీడీపీ కూటమిపై ఆగ్రహావేశాలతో ఉంటే.. కనీసం ఇంత భారీ స్థాయిలో విపత్తు ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తట్టుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!