Sunday, October 13, 2024

Jagan -Chandrababu: EVM ల పై కోర్టు సంచలన తీర్పు.. ఉలిక్కిపడ్డ జగన్ చంద్రబాబు..?!

- Advertisement -

Jagan -Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత ఈవీఎంలపై బాలినేని పోరాడిన సంగతి తెలిసిందే. ఈవీఎంలు, వీవీ ప్యాడ్లకు చెందిన లెక్కలు తేలాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలు, వీవీప్యాడ్లు లెక్కించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్‌ ఆయా ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌ చేపడుతుందని చెప్పడంతో వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని వైసీపీ స్పష్టం చేసింది.

మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని వారు అన్నారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీప్యాడ్లు తనిఖీ మరియు పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ-ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జగన్ ముందుగానే చెప్పినట్లు ఈవీఎంల గోల్ మాల్ త్వరలో బయటపడనుందని కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఒకప్పుడు వైసీపీలో ఉండి ఈవీఎంల అవకతవకల పైన పోరాటం చేసిన బాలినేని ఇప్పుడు ఆ పార్టీలో లేడు.

ఈవీఎంల అంశంలో తమకు ఎలాంటి అడ్డంకి రాకూడదనే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తమ కూటమిలో చేర్చుకున్నారని వైసీపీ ఇప్పటికే ఆరోపించింది. అయితే బాలినేని లేకపోతే ఏంటని రాష్ట్ర ప్రజలకి జరిగిన అన్యాయం తరపున వైసీపీ ఎప్పటికీ పోరాడుతుందని ఈవీఎంల కేసు విషయంలో వైసీపీ సుప్రీమ్ కోర్టుకి వెళ్లనున్నట్లు పలువురు పార్టీ నేతలు తెలిపారు. దీని గురించి త్వరలోనే విచారణ జరగనున్నట్లు వారు వెల్లడించారు. ఈవీఎంల పైన పోరాడిన బాలినేని ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారు కాబట్టి కోర్టు తీర్పులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, వారు ఆధారాలని నాశనం చేసే అవకాశం ఉందని కోర్టుకి వైసీపీ ఫిర్యాదు చేసింది. తీర్పు రిజర్వు చేసి చాలా రోజులైనా ఇంకా ఎందుకు ప్రకటించలేదని వారు ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు వెంటే చంద్రబాబు ఉలిక్కి పడటం ఖాయమని అందుకే తన అధికారం అంతా ఉపయోగించి తీర్పు వాయిదా చేయించారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!