YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దృష్ట్యా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ చేసిన కృషికి ఫలితం లభిస్తోంది. తనదైన పాలనారీతిలో పరిశ్రమల అభివృద్ధికి జగన్ తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చడం శుభ పరిణామంగా తెలుస్తోంది. ఇందుకు కారణం విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు కార్యాచరణకు సిద్ధం కావడమే. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాల లబ్ది జరగడమే కాకుండా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లాలో గ్రీన్‌కో గ్రూప్ సంస్థ రూ.12,500 కోట్ల పెట్టుబడులపై కూడా తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు 2026లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.