అల్లు అర్జున్ (Allu Arjun) వర్సెస్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీళ్లిద్దరి మధ్య వివాదం రోజురోజుకీ మరింత దారుణంగా ముదిరిపోతుంది. ఇంక వీళ్ళిద్దరి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ముందుకి వచ్చి ఒక స్పష్టత ఇచ్చి ఇది ఇక్కడితో ముగిస్తే రెండు కుటుంబాలకి వారి అభిమానులకి బాగుంటుంది. ఇరువర్గాల అభిమానులు పోటాపోటీగా ఒకరిని ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) అల్లు అర్జున్ ఏమైనా గొప్ప వ్యక్తా, అతనికి అభిమానులు ఉన్నారా? అతనికి ఉన్నదంతా మెగా అభిమానులే ఆయన ఏదో భ్రమలో ఉన్నారని జాగ్రత్తగా మాట్లాడాలని, ఆయనకి ఉన్న అభిమానులు షామియానా కంపెనీ లాంటి వాళ్ళని తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులంతా రంగంలోకి దిగి మా అభిమాన హీరోని ఇన్ని మాటలు అంటారా? అభిమానులు ఎవరూ లేరని అంటారా అని సోషల్ మీడియాలో బొలిశెట్టి గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ఆయన టిడిపిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారిని దొంగబ్బాయి అని సంబోధించిన వీడియో క్లిప్ ని వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అలాగే ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకులు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించారు అనేది కూడా వీడియో క్లిప్పులతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరంతా ఇలాంటి వాళ్లు మీరు జాగ్రత్తగా ఉండండి మా జోలికి రావద్దండి అంటూ తెగ ఆవేశ పడిపోతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అలాగే ఇటు పవన్ అభిమానులు కూడా మేము ఏమీ తక్కువ కాదు అంటూ వీళ్ళు కూడా అల్లు అర్జున్ పైన అలాగే అతని అభిమానుల పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలోనే (Tadepalligudem) ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి అల్లు అర్జున్ కి ఒక ఆర్మీ ఉంది చాలామంది అభిమానులు ఉన్నారని నిరూపించాలి అనుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ కనుక ర్యాలీకి ఓకే అంటే వెంటనే ర్యాలీ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ గనుక ఇది చాలా పెద్ద వివాదానికి దారితీస్తుందని ర్యాలీ వద్దు అంటే అభిమానులు ఆగిపోయే అవకాశం ఉంది. కానీ మొత్తానికి అయితే అల్లు అర్జున్ అభిమానులు అంతా కలిసి ఆయనకి ర్యాలీ జరిపిస్తాము అని ఒక ప్రపోజల్ అయితే పెట్టినట్లు తెలుస్తుంది.