Thursday, May 16, 2024

పవన్‌కు ముద్రగడ పద్మనాభం షాక్.. కీలక నిర్ణయం దిశగా కాపు ఉద్యమ నేత..?

- Advertisement -

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు కూడా కులప్రాతిపాదికన జరుగుతాయనే విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల్లో ఎన్నికల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. రెడ్లు, కమ్మ కులాలకు చెందిన నాయకులు ఎప్పటికప్పుడు తమ అధిపాత్యన్ని నిరుపించాలకొవాలని చూస్తుంటారు. ఇప్పటి వరకు జరిగింది కూడా అదే. టీడీపీకి కమ్మ కులస్తులు అండగా ఉండగా… గతంలో కాంగ్రెస్ పార్టీకి ..ప్రస్తుతం వైసీపీ పార్టీకి రెడ్డి కులస్తులు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో కాపులు కూడా రాజకీయంగా ఎదగలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

వంగవీటి రంగ టైమ్ నుంచి కూడా కాపులు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కాని.. రాజకీయంగా మాత్రం పెద్దగా ఎదగలేకపోయారు. తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికి కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేన స్థాపించారు. పార్టీ పెట్టి ఈనేళ్లు అయినప్పటికి కూడా ఆయన మాత్రం రాజకీయంగా సాధించింది మాత్రం శూన్యం. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి .. టీడీపీని గెలిపించిన .. 2019 ఎన్నికల్లో పోటీ చేసి తానే ఓడిపోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే మరోసారి ఆయన చంద్రబాబును సీఎం చేయలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే కొత్తగా కాపు ఎమ్మెల్యేలపై దూషణలకు దిగుతున్నారు. ఇదే సమయంలో కాపు ఓట్లపై ఆయన భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన వెంట నడవడానికి కాపు నేతలు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. నిలకడలేని మనస్థత్వం ఒకటి అయితే… ఆవేశంతో కూడిని రాజకీయం మరోకటిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలంలో పెద్దగా బయటకు రావడం లేదు. ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఆయన కాపులకు రిజర్వేషన్ల కోసం చాలానే ఉద్యమాలు చేయడం జరిగింది. టీడీపీ హయంలో అయితే కాపు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని హమీ ఇచ్చి ఆ కులం మద్దతుతో సీఎం కాగలిగారు. కాని ఎన్నికల్లో గెలిచిన తరువాత కాపుల రిజర్వేషన్‌పై మాట తప్పారు. దీంతో కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపారు ముద్రగడ పద్మనాభం. కాపులందరిని ఏకం చేసే ప్రయత్నం చేశారాయన.

కాపులను రాజకీయంగా ఎదిగితే తమకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు.. వారిని అణగదొక్కే ప్రయత్నం చేశారు.ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా హోస్ అరెస్ట్ చేయించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాపులు మీటింగ్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అతి దారుణంగా హింసించారు. ఈ ఘటనల తరువాత ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. కాపు ఉద్యమ నేతగా తప్పుకుంటున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే ఆయన రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌గా మారాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

తనని తన కుటుంబాన్ని హింసించిన చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్‌తో ముద్రగడ పద్మనాభంతో కలుస్తారా అంటే లేదనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పవన్ ఒంటరిగా ఉంటే ఆయన కలిసేవారని కాని.. ఆయన చంద్రబాబుతో దోస్తీ చేస్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి ముద్రగడ పద్మనాభం దూరంగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో ఆయన వైసీపీలో చేరుతారనే అభిప్రాయం కూడా ఎక్కువుగా వ్యక్తం అవుతుంది. ముద్రగడ పద్మనాభం అప్షన్ కూడా వైసీపీనే అని.. ఆయన వైసీపీలో చేరితేనే గౌరవం కూడా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కాపులు అండగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!