Tuesday, April 22, 2025

టీటీడీతో వ్యాపారాలా? ముఖ్యమంత్రి వర్సెస్ చైర్మన్!

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపారాలా.. నో ఛాన్స్.. అటువంటి వాటికి అవకాశం లేదు. అందుకే గత ప్రభుత్వం కేటాయించిన భూములు రద్దు చేస్తున్నాం.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా ఈ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు. కానీ అదే సీఎం చంద్రబాబు ఇప్పుడు ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టీటీడీ బ్రాండ్ ను ఇచ్చేశారు. వద్దు అని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వారించినా సీఎం వినకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ధార్మిక సంస్థ. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తి కలిగించడం టిటిడి ముఖ్య విధి. అందులో భాగంగానే టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చారు నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి. తిరుమలలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఫైవ్ స్టార్ హోటల్స్ యాజమాన్యాలకు ప్రోత్సాహం అందించారు. ఓ 15 ఎకరాల భూమిని కేటాయించారు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆ పదిహేను ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. అలా టెంపుల్ టూరిజానికి విఘాతం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక భూముల రద్దె కాదు. చాలా విషయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలను ఉపసంహరించుకుంది.

తాజాగా ఓ విచిత్రకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తమిళనాడుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ టిటిడిని ఆశ్రయించింది. తమ వెంచర్లు వేసిన ప్రతిచోట శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేస్తామని.. అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్. సదరు సంస్థ సొంత నిధులతో ఏర్పాటుకు ముందుకు వచ్చింది కానీ.. ఆ ఆలయాలకు టీటీడీ అని పేరు పెడతామని చెప్పింది. దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు అనుమతులు మంజూరు చేయలేదు. ఆలయాలు నిర్మిస్తుంది సరే.. వాటి నిర్వహణ తర్వాత టీటీడీ పైన పడే అవకాశం ఉంది. చైర్మన్ అభ్యంతరానికి కారణం అదే.

అయితే నిన్న అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం పై సమీక్షించారు సీఎం చంద్రబాబు. రియల్ ఎస్టేట్ సంస్థ ఆలయాలు నిర్మించుకుంటామని ముందుకు వస్తే మీకు అభ్యంతరం ఏంటని బిఆర్ నాయుడును ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా టీటీడీ సొంతంగా ఆలయాలు నిర్మిస్తుందని.. అటువంటప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతంగానే నిర్మించుకోవచ్చని.. కానీ టీటీడీ అని పేరు పెట్టడం ద్వారా.. తరువాత ఆలయాల నిర్వహణ భారం తిరుమల తిరుపతి దేవస్థానం పై పడే అవకాశం ఉందని బిఆర్ నాయుడు తన వాదనను వినిపించారు. అయితే సీఎం చంద్రబాబు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో సదరు సంస్థకు అనుమతి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టెంపుల్ టూరిజంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు లాభం చేకూర్చేలా వ్యవహరించడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. దీనిపై టీటీడీ వర్గాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు వైఖరిని అందరూ తప్పు పడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!